Vegan Food: ఆరోగ్యం అంటూ పచ్చి కూరలను తింటున్నారా.. మహిళల్లో వంధ్యత్వానికి కనెక్షన్ అంటోన్న నిపుణులు
45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మహిళల్లో 30% మంది మూడు సంవత్సరాలకు పైగా పచ్చి శాఖాహారాన్ని తీసుకోవడం వలన పాక్షికంగా అమెనోరియా (రుతుక్రమం రాకపోవడం) బారిన పడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా శాఖాహారం బాగా ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకునే వ్యక్తులు ఎక్కువగా శాఖాహారాన్ని తీసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల ఆకు కూరలను, కూరగాయలను వండకుండా పచ్చిగా తినడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇలా చేయడం వలన అనేక ఆహార ప్రయోజనాలు ఉంటాయని.. బరువును తగ్గించడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని విశ్వాసం. అంతేకాదు పచ్చి కూరగాయలు తినడం వలన గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని భావిస్తున్నారు. అయితే బ్రిటన్‌లోని టీసైడ్ యూనివర్శిటీలో న్యూట్రిషన్, ఫుడ్ అండ్ హెల్త్ సైన్స్ ప్రొఫెసర్ లారా బ్రౌన్ ఇలా పచ్చి కూరగాయలను తినే వారికీ కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఎక్కువమంది శాకాహారం పేరుతో విపరీతమైన పరిస్థితుల వైపు వెళ్తున్నారన్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వండకుండా తినగలిగే మొక్కల నుండి లభించే ఎక్కువగా ఆహారాన్ని వినియోగిస్తున్నారు. అయితే ఇలా ప్రాసెస్ చేయని ఆహారం హానికరమని చెబుతూనే.. వాటి నుంచి వోట్ లేదా బాదం పాలు వంటివాటిని మినహాయించారు ప్రొఫెసర్ లారా బ్రౌన్.
శాఖాహారులు కొన్ని రకాల కూరగాయలను, ఆకు కూరలను వంట చేసుకుని తినడం వలన దానిలోని కొన్ని ముఖ్యమైన పోషకాలు, ఎంజైమ్‌లను కోల్పోతుందని భావిస్తారు. అందుకనే ఆహారంగా కొన్ని రకాల ఆకు కూరలను వంటి వాటిని వండకుండా తీసుకుంటున్నారు. ఇలా చేయడం వలన మానవుల్లో శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుందని.. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని.. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నమ్ముతారు.
అయితే ప్రొఫెసర్ బ్రౌన్ పరిశోధనల ఇదే విషయంపై సంచలన విషయాలను వెల్లడించారు. ఇలా పచ్చి శాఖాహారం ఎక్కువ కాలం తీసుకుంటే, అది మంచి కంటే ఎక్కువ హాని చేస్తుందని పేర్కొన్నారు. మీరు ముఖ్యమైన పోషకాలను కోల్పోతారని ప్రొఫెసర్ బ్రౌన్ చెప్పారు. కొన్ని పచ్చి ఆహారాల కంటే వండిన ఆహారం ఆరోగ్యకరమైనవి కావచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.
కొన్ని కూరగాయలు వండేటప్పుడు పోషకాలను కోల్పోవచ్చు, మరికొన్ని వండినప్పుడు ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. ఎందుకంటే కూరగాయల సెల్ గోడలో కొన్ని పోషకాలు ఉంటాయి. వంట చేయడం వల్ల కణ గోడలు విచ్చుకుని.. పోషకాలను విడుదల అవుతాయి. ఈ పోషకాలను శరీరం సులభంగా గ్రహిస్తుంది.
బచ్చలికూర వండినప్పుడు, శరీరం కాల్షియం గ్రహించడం సులభం అవుతుంది. టొమాటోలను ఉడికించడం వల్ల వాటి విటమిన్ సి కంటెంట్ 28% తగ్గిపోతుంది.. అయితే వాటిలోని లైకోపీన్ కంటెంట్ 50% కంటే ఎక్కువ పెరుగుతుంది. లైకోపీన్ గుండె జబ్బులు, క్యాన్సర్, గుండె జబ్బులతో సహా అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా పుట్టగొడుగులు, క్యారెట్లు, బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయలు ఉడికించినప్పుడు ఎక్కువ పోషకాలను అందిస్తాయి.
ఉడికించిన కూరగాయలతో ఆరోగ్య ప్రయోజనాలు వండిన కూరగాయలు శరీరానికి ఎక్కువ యాంటీఆక్సిడెంట్లను అందించగలవని ప్రొఫెసర్ బ్రౌన్ చెప్పారు. ఇవి ఫ్రీ రాడికల్స్ అని పిలువబడే ఒక రకమైన హానికరమైన అణువుతో పోరాడగల అణువులని పేర్కొన్నారు. యాంటీఆక్సిడెంట్లు, బీటా-కెరోటిన్ లు, లైకోపీన్‌లు కొన్ని కూరగాయలు పచ్చిగా ఉన్నప్పుడు కంటే.. ఉడికించినప్పుడు కంటే ఎక్కువగా ఉంటాయి.
విటమిన్, మినరల్ లోపాలకు అవకాశం ఉంది పచ్చిగా తినే ఆహారంలో అనేక ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉండవు. విటమిన్లు B12 , D, సెలీనియం, జింక్, ఇనుము , ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వంటివి. ఎందుకంటే ఈ విటమిన్లు , మినరల్స్ జంతువుల నుండి లభించే ఆహారంలో ఎక్కువగా ఉంటాయి. మాంసం , గుడ్లు వంటివి ఇందుకు ఉదాహరణ. ఈ విటమిన్లు అన్నీ మెదడు, నరాల కణాల నిర్మాణం, పెరుగుదల , ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తాయి.
రోజు రోజుకీ విటమిన్ B12 లోపం ఉన్నవారు ఎక్కువతున్నారని కొన్ని లెక్కల ద్వారా తెలుస్తోంది. ఒక అధ్యయనంలో 38% మంది విటమిన్ B12 లోపాన్ని కలిగి ఉన్నారని వెల్లడైంది. విటమిన్ B12 లోపం వలన కామెర్లు, నోటి పుండ్లు, దృష్టి సమస్యలు, నిరాశ , ఇతర మానసిక ఇబ్బందుల సహా అనేక శారీరక సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అదే అధ్యయనంలో పచ్చి ఆహారం తినే వారిలో B12 లోపం ఏర్పడుతుందని తద్వారా హోమోసిస్టీన్ స్థాయిలను పెంచుతుందని కనుగొన్నారు. పెరిగిన హోమోసిస్టీన్ స్థాయిలు గుండె జబ్బులు , స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయని వెల్లడించారు.
మహిళల్లో రుతుక్రమంలో మార్పులు స్త్రీలు శరీరం పని చేయడానికి అవసరమైన కేలరీలను మీరు తీసుకోనందున.. అధికంగా బరువు తగ్గుతారు. ఇది ముఖ్యంగా బాలికల్లో ఆందోళన కలిగించే అంశం.
45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మహిళల్లో 30% మంది మూడు సంవత్సరాలకు పైగా పచ్చి శాఖాహారాన్ని తీసుకోవడం వలన పాక్షికంగా అమెనోరియా (రుతుక్రమం రాకపోవడం) బారిన పడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. ఇలా జరగడానికి కారణం పచ్చి శాఖాహారం ఆహారం తీసుకోవడం.. బరువు తగ్గడం వల్ల కావచ్చన్నారు.
వంధ్యత్వానికి ప్రమాదం! అమెనోరియా వలన వంధ్యత్వం, ఎముకల ఖనిజ సాంద్రతను తగ్గించడం, బోలు ఎముకల వ్యాధికి దారితీయడం వంటి అనేక సమస్యలను కలిగిస్తుంది. అనేక ఇతర అధ్యయనాలు కూడా తమకు అవసరమైన దానికంటే 22-42% తక్కువ కేలరీలు తీసుకునే యువతులకు పునరుత్పత్తి వ్యవస్థ సరిగా పనిచేయకపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది.
మొక్కల ఆధారిత ఆహారంతో జాగ్రత్తగా ఉండండి మొక్కల ఆధారిత ఆహారాన్ని పచ్చిగా తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. అదే సమయంలో అనేక ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తాయి.
మీరు పచ్చి శాఖాహార ఆహారాన్ని డైట్ గా తీసుకోవాలని భావిస్తే.. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలున్న ఆహారం తీసుకోవాలి.. నిపుణుల సూచనలు అనుసరించి జాగ్రత్తగా డైట్ ప్లాన్ చేసుకోవడం ముఖ్యం. లేదంటే అనేక ప్రమాదాల కారణం కావచ్చు అని బ్రౌన్ హెచ్చరిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..