ఎయిర్‌లైన్‌ ప్యాసింజర్‌కు వింత అనుభవం.. నుజ్జు నుజ్జైన లగేజీ బ్యాగ్‌.. యాక్సిడెంట్‌ అనుకుంటే పొరపాటే..!

ప్లేన్ జర్నీ ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది. విమానంలో కొందరు ప్రయాణికులు వింతగా వ్యవహరిస్తున్న ఘటనలు ఇటీవల చాలానే జరుగుతున్నాయి. అయితే, ఫ్లైట్ అటెండెంట్‌కి లగేజీని ఇచ్చే ముందు ఫోటో తీసుకోండి.., అప్పుడు వారు మీ లగేజీని ఏ స్థితిలో పెడతారో..మీకు తెలుస్తుంది.

ఎయిర్‌లైన్‌ ప్యాసింజర్‌కు వింత అనుభవం.. నుజ్జు నుజ్జైన లగేజీ బ్యాగ్‌.. యాక్సిడెంట్‌ అనుకుంటే పొరపాటే..!
Suitcase
Follow us

|

Updated on: Nov 05, 2022 | 8:56 AM

విమాన ప్రయాణం సాధారణంగానే ఓ వింత అనుభవం. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు మీరు ఒకవైపు ఉంటే, మీ విలువైన వస్తువులు లగేజీ మరోవైపు ఉంటాయి. కొన్నికొన్ని సార్లు ఆ లగేజీ తిరిగి పొందుతామనే ఆశ కూడా ఉండదు. విమానంలో ప్రయాణించిన పలువురు ఇప్పటికే తమ లగేజీని పోగొట్టుకున్న అనుభవాలను సోషల్ మీడియాలో అనేకం చూస్తుంటాం.. అదేవిధంగా ఇప్పుడు ఓ వ్యక్తి తన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. అయితే ఇక్కడ అతను తన సామాను తిరిగి పొందారు. కానీ అది పూర్తిగా ధ్వంసమై పోయింది. అవును, అతడి లగేజీ సూట్‌కేస్‌ పూర్తి ధ్వంసమైంది. అది ఏ స్థితిలో ఉందో చెప్పలేం. అతడు తన గమ్యస్థానం చేరుకున్న తర్వాత విమానం దిగి.. బ్యాగేజీ కౌంటర్ సమీపంలోని లగేజీ ఎక్స్‌ లేటర్‌ వద్దకు వెళ్లాడు. గుర్తుల ఆధారంగా అతడు తన సామాను సేకరించాలి. కానీ, అతడి సూట్‌కేస్‌ చూసి కంగుతిన్నాడు. గుర్తు పట్టలేనంతగా పాడైపోయిన తన లగేజీ బ్యాగ్ చూసి నమ్మలేకపోయాడు. దానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

రెడ్డిట్‌లో పోస్ట్ చేసిన ఈ లగేజీని చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమాన సిబ్బంది ఈ లగేజీని విమానం నుంచి విసిరేశరా..? ఏంటీ అంటూ ఒకరు ప్రశ్నించారు. విమానం నుండి విసిరినా అది బాగానే ఉండేది. ల్యాండింగ్ గేర్‌కు బదులు ఈ లగేజీని ఎందుకు వినియోగిస్తున్నారంటూ మరొ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ల్యాండింగ్ గేర్ పాడైపోవడంతో ఇతడి బ్యాగును ఉపయోగించక తప్పలేదనుకుంటా అని  మరొకరు వ్యాఖ్యానించారు. ఫ్లైట్ అటెండెంట్‌కి లగేజీని ఇచ్చే ముందు ఫోటో తీసుకోండి.., అప్పుడు వారు మీ లగేజీని ఏ స్థితిలో పెడతారో..మీకు తెలుస్తుందని మరొకరు వ్యాఖ్యానించారు. అలాగే, చాలా మంది తమ అనుభవాలను కామెంట్ సెక్షన్‌లో పంచుకున్నారు. ఆ లగేజీ బ్యాగ్‌ ఎలాంటి స్థితిలో ఉందో ఈ క్రింది ఫోటోలో మీరూ చూడండి..

ఇవి కూడా చదవండి

మొత్తానికి తరచూ విమానంలో ప్రయాణించే ప్రయాణికులు ఈ లగేజీ పరిస్థితిని చూసి షాకైనట్లు ఈ ఫోటోలో తేలింది. ఈ ఒక్క ఫోటోపై 97 వేల మందికి పైగా కామెంట్ చేశారు. సాధారణంగా విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు మన చేతిలో హ్యాండ్ బ్యాగ్ తప్ప మరే ఇతర లగేజీ ఉండదు. విమాన ప్రయాణంలో భద్రతా నిబంధనలే కాకుండా అనేక నిబంధనలు విధిస్తున్న విమాన సిబ్బంది ప్రయాణికుల లగేజీ విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి