Kaushalya Maternity Scheme: రెండో కూతురు పుడితే ప్రభుత్వం ఇంత డబ్బు ఇస్తుందా..?
కౌశల్య ప్రసూతి పథకం దేశంలోని ఆడపిల్లల భవిష్యత్తును పరిరక్షించడంతో పాటు మెరుగుపరచడం కోసం ప్రభుత్వాలు, సంస్థలు నిరంతరం కృషి చేస్తున్నాయి. ఆడ భ్రూణహత్యల రేటును..
కౌశల్య ప్రసూతి పథకం దేశంలోని ఆడపిల్లల భవిష్యత్తును పరిరక్షించడంతో పాటు మెరుగుపరచడం కోసం ప్రభుత్వాలు, సంస్థలు నిరంతరం కృషి చేస్తున్నాయి. ఆడ భ్రూణహత్యల రేటును తగ్గించేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కౌశల్య ప్రసూతి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఈ పథకాన్ని ప్రారంభించారు. కుటుంబంలో రెండవ సంతానం కూతురు ఉన్నప్పుడే ఈ పథకం ప్రయోజనం అందుతుంది. మీరు మొదటి సంతానం మాత్రమే ఉంటే మీరు ఈ పథకం ప్రయోజనాన్ని పొందలేరు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబంలో రెండో ఆడపిల్ల పుడితే వారికి రూ.5 వేలు అందజేస్తారు. దీంతో కూతుళ్ల పట్ల ప్రజల్లో ఉన్న ప్రతికూల ఆలోచనకు తెరపడుతుంది. ఆడపిల్ల పుట్టిన తర్వాత వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఇది సహాయపడుతుంది.
అర్హత ఏమిటి..?
- ఛత్తీస్‌గఢ్ కౌశల్య మాతృత్వ యోజన ప్రయోజనాన్ని పొందడానికి అభ్యర్థి చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండటం తప్పనిసరి.
- మొదటి కుమార్తె తర్వాత రెండవ కుమార్తె ఉన్న సందర్భంలో మాత్రమే ఈ పథకం ప్రయోజనం పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
- దరఖాస్తుదారు రేషన్ కార్డు, శాశ్వత సర్టిఫికేట్ వంటి పత్రాలను కలిగి ఉండాలి.
ఎలాంటి పత్రాలు అవసరం:
- ఆధార్ కార్డు
- ప్రాథమిక చిరునామా రుజువు
- ఆదాయ ధృవీకరణ పత్రం
- రేషన్ కార్డు
- వయస్సు సర్టిఫికేట్
- ఆడపిల్లల జనన ధృవీకరణ పత్రం (ఇద్దరు కుమార్తెల జనన ధృవీకరణ పత్రం)
- ఓటరు ఐడి
- మొబైల్ నంబర్
- ఇ మెయిల్ ఐడి
దరఖాస్తులు ఎప్పుడు ప్రారంభమవుతాయి:
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు ముఖ్యమంత్రి అర్హులైన ఐదు కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు అందించారు. అయితే దరఖాస్తు కోసం ఆన్‌లైన్ వెబ్‌సైట్ ఇంకా ప్రకటించబడలేదు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో వీటి కోసం దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుంది. ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మాత్రమే ప్రజలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోగలరు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి