Post Office Schemes: పోస్టాఫీసుల్లో ఈ మూడు పథకాలతో అద్భుతమైన లాభాలు

Post Office Schemes: తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎక్కువ రాబడిని పొందాలంటే పోస్టాఫీసుల్లో అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. డబ్బులు చేతిలో ఉండి పోస్టాఫీసుల్లో ఉండే పలు రకాల స్కీమ్‌లలో..

Post Office Schemes: పోస్టాఫీసుల్లో ఈ మూడు పథకాలతో అద్భుతమైన లాభాలు
Post Office Saving Scheme
Follow us
Subhash Goud

|

Updated on: Nov 05, 2022 | 9:08 AM

Post Office Schemes: తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎక్కువ రాబడిని పొందాలంటే పోస్టాఫీసుల్లో అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. డబ్బులు చేతిలో ఉండి పోస్టాఫీసుల్లో ఉండే పలు రకాల స్కీమ్‌లలో చేరితే మంచి లాభాలు పొందవచ్చు అంటున్నారు వ్యాపార వేత్తలు. భారతీయ తపాలా శాఖ కస్టమర్ల కోసం రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. బ్యాంకుల మాదిరిగానే పోస్టాఫీసుల్లో పలు రకాల పథకాలు ఉన్నాయి. ప్రజలు మరింతగా రాబడి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసుల్లో పథకాలను ప్రవేశపెడుతోంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పాటు వివిధ రకాల పథకాలలో చేరి ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే పెట్టిన పెట్టుబడికంటే ఎక్కువ మొత్తంలో బెనిఫిట్స్‌ పొందవచ్చు. అంతేకాకుండా పోస్టల్‌ శాఖలో ఉండే పథకాలలో పెట్టుబడి పెట్టడం వల్ల పన్ను మినహాయింపు కూడా పొందే సౌలభ్యం ఉంది. ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద మినహాయింపు ప్రయోజనాలను పొందే అటువంటి కొన్ని పథకాల గురించి మీకు తెలియజేస్తున్నాము.

సుకన్య సమృద్ధి ఖాతా:

మరో పథకం సుకన్య సమృద్ధి యోజన. ఈ పథకం ద్వారా కూడా మెచ్యూరిటీ తర్వాత మంచి రాబడి పొందవచ్చు. ఈ పథకం బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ పథకం కూతురు వివాహం, చదువుల నిమిత్తం ఉపయోగపడనుంది. ఈ పథకంలో పెట్టిన పెట్టుబడిపై 7.6% వడ్డీ లభిస్తుంది. మీరు 90 రోజుల నుండి 10 సంవత్సరాల వయస్సు గల ఆడపిల్లల కోసం ఈ పథకంలో చేరేందుకు ఖాతాను తీయవచ్చు. ఇందులో మీరు ప్రతి సంవత్సరం కనిష్టంగా రూ. 250, గరిష్టంగా రూ. 1,50,000 పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద మినహాయింపు పొందవచ్చు. ఆడపిల్లకు 21 ఏళ్లు నిండిన తర్వాత మీరు మొత్తాన్ని ఖాతా నుండి ఉపసంహరించుకోవచ్చు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా:

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా (పీపీఎఫ్‌) స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు. అలాగే పన్ను ఆదా చేసుకునే ప్రయోజనం కూడా పొందవచ్చు. ఈ పథకంపై 7.1% రాబడిని పొందవచ్చు. మీరు ఈ పథకంలో మొత్తం 15 సంవత్సరాల పాటు డబ్బును ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఆర్థిక సంవత్సరానికి కనీస పెట్టుబడి మొత్తం రూ.500, గరిష్ట మొత్తం రూ.1.5 లక్షలు. మూడేళ్ల తర్వాత మీరు దానిపై రుణం కూడా పొందవచ్చు. ఐదేళ్ల తర్వాత అవసరమైతే మీరు ఈ ఖాతా నుండి పాక్షిక ఉపసంహరణ కూడా చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్:

సీనియర్‌ సిటిజన్‌ల కోసం పోస్టాఫీసుల్లో వివిధ రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టి మంచి రాబడి పొందవచ్చు. ఇందులో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాలంటే 60 ఏళ్లు పైఔబడి ఉండాలి. ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే పన్ను ఆదా ప్రయోజనాలతో పాటు బ్యాంకు ఎఫ్‌డీలకంటే ఎక్కువ రాబడి పొందవచ్చు. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే మీకు 7.4% వడ్డీ రేటు లభిస్తుంది. మీరు చేసిన డిపాజిట్లపై ప్రతి మూడు నెలల తర్వాత వడ్డీ జమ అవుతుంది. మీరు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కింద ఒంటరిగా లేదా మీ జీవిత భాగస్వామితో పోస్టాఫీసు ఖాతాను ఓపెన్‌ చేసి పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్‌లో కనీసం రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్‌మెంట్‌ చేయవచ్చు. మెచ్యూరిటీ ఐదు సంవత్సరాలు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి