LPG Booking Offers: ఎల్‌పీజీ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌.. గ్యాస్‌ బుకింగ్‌పై 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్.. ఎలా అంటే

ఈ రోజుల్లో వంట గ్యాస్‌ సిలిండర్‌ను ప్రతి ఒక్కరు వినియోగిస్తున్నారు. ప్రతి నెల గ్యాస్‌ సిలిండర్‌లలో మార్పులు జరుగుతుంటాయి. నెలనెల అటు గృహ అవసరాలకు వినియోగించే సిలిండ ధరలో..

LPG Booking Offers: ఎల్‌పీజీ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌.. గ్యాస్‌ బుకింగ్‌పై 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్.. ఎలా అంటే
Gas Cylinder
Follow us

|

Updated on: Nov 04, 2022 | 1:34 PM

ఈ రోజుల్లో వంట గ్యాస్‌ సిలిండర్‌ను ప్రతి ఒక్కరు వినియోగిస్తున్నారు. ప్రతి నెల గ్యాస్‌ సిలిండర్‌లలో మార్పులు జరుగుతుంటాయి. నెలనెల అటు గృహ అవసరాలకు వినియోగించే సిలిండ ధరలో గానీ, వ్యాపారానికి ఉపయోగించే సిలిండర్‌ ధరలలో మార్పులు జరుగుతున్నాయి. ఇక కస్టమర్లను మరింతగా ఆకర్షించేందుకు పలు డిజిటల్‌ యాప్స్‌ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటిస్తున్నాయి. గ్యాస్‌ బుకింగ్‌ చేసుకున్నవారికి 20% తగ్గింపు ఆఫర్‌ అందిస్తున్నాయి. దేశంలో పెరుగుతున్న డిజిటలైజేషన్‌తో యాప్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకునే వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఈ రోజుల్లో చాలా మంది పేటీఎం, ఫ్రీఛార్జ్, బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్, పోన్‌పే తదితర యాప్స్‌ ద్వారా ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ను బుక్‌ చేసుకుంటున్నారు. కస్టమర్లను తమ వైపు ఆకర్షించేందుకు కంపెనీలు అనేక రకాల ఆఫర్లను ఇస్తున్నాయి. ఇందులో మీరు ఫ్రీఛార్జ్, బజాజ్ ఫిన్‌సర్వ్ వంటి యాప్‌ల ద్వారా బుకింగ్‌పై క్యాష్‌బ్యాక్‌, డిస్కౌంట్‌ ఆఫర్లను అందిస్తున్నాయి.

ఫ్రీఛార్జ్

మీరు ఈ ఫ్రీఛార్జ్‌ యాప్ ద్వారా మొదటిసారి ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ను బుక్ చేస్తున్నట్లయితే మీరు 20% క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అంటే గరిష్టంగా రూ. 200 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది. ఈ యాప్ భారత్ గ్యాస్ హెచ్‌పీ గ్యాస్, ఇండనే గ్యాస్ మూడింటిని బుక్ చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు కూడా మొదటి సారి ఫ్రీఛార్జ్ యాప్ ద్వారా బుక్ చేసుకోవడం ద్వారా రూ. 200 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

ఫ్రీఛార్జ్ నుండి గ్యాస్ బుక్ చేసుకోవడం ఎలా-

☛ ఇందుకోసం ముందుగా యాప్ ఓపెన్ చేసి ఆ తర్వాత గ్యాస్ ప్రొవైడర్ ఆప్షన్‌ను ఎంచుకోండి.

ఇవి కూడా చదవండి

☛ ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.

☛ ఆ తర్వాత మీరు చెల్లింపు ఆప్షన్‌ ఎంచుకుని ఆ తర్వాత మీరు నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేస్తారు.

☛ క్యాష్‌బ్యాక్ పొందడానికి మీరు GAS100 ప్రోమోకోడ్‌ను నమోదు చేయాలి.

☛ దీని తర్వాత చెల్లింపు చేసిన తర్వాత మీ గ్యాస్ బుకింగ్ చేయబడుతుంది.

☛ బుకింగ్ చేసిన 2 రోజులలోపు క్యాష్‌బ్యాక్ డబ్బు మీ ఖాతాకు క్రెడిట్‌ అవుతాయి

☛ బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్ ద్వారా 10% వరకు క్యాష్‌బ్యాక్

బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్ ద్వారా..

బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేస్తే మీకు 10% లేదా గరిష్టంగా రూ. 70 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ కిక్‌బ్యాక్ పొందడానికి మీరు చెల్లింపు కోసం బజాజ్ పే UPI ద్వారా చెల్లింపు చేయాలి. మీరు ఈ యాప్‌తో ఎల్‌పీజీ ఎలా బుక్ చేసుకోవచ్చో చూడండి.

బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్ నుండి గ్యాస్ బుక్ చేయడం ఎలా-

☛ ఇందుకోసం ముందుగా ఈ యాప్‌ని ఓపెన్ చేసి అందులో ఎల్‌పీజీ గ్యాస్ ఆప్షన్‌ను ఎంచుకోండి.

☛ దీని తర్వాత ఎల్‌పీజీలో సెలెక్ట్ ప్రొవైడర్‌ని ఎంచుకోవడం ద్వారా మీ కంపెనీని ఎంచుకోండి.

☛ ఆ తర్వాత మీరు చెల్లింపు చేయాలి. ఇక్కడ చెల్లింపు కోసం బజాజ్ పే యూపీఐని ఎంచుకోండి. ఇందులో మీరు 10% క్యాష్‌బ్యాక్ ప్రయోజనం పొందుతారు.

☛ దీని తర్వాత మీరు చెల్లింపు చేసిన వెంటనే క్యాష్‌బ్యాక్ మొత్తం మీ బజాజ్ పే యూపీఐ ఖాతాకు బదిలీ చేయబడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
ముస్లింలను OBC జాబితాలో చేర్చిన ఆ రాష్ట్ర సర్కార్
ముస్లింలను OBC జాబితాలో చేర్చిన ఆ రాష్ట్ర సర్కార్
ఇతను రీల్ మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా.... సాయం అనగానే..
ఇతను రీల్ మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా.... సాయం అనగానే..