Aadhaar Card Update: ఆధార్ కార్డులో సమస్యలున్నాయా..? ఈ ఒక్క నెంబర్‌కు ఫోన్‌ చేయండి చాలు..!

ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్‌ ఒకటి. ఇది లేనిది ఏ పని జరగదు. ప్రభుత్వ, ప్రైవేటు పథకాల నుంచి ఇతర చిన్నపాటి పనులకు కూడా ఆధార్‌ తప్పనిసరైంది. గతంలో ఆధార్‌ కార్డు..

Aadhaar Card Update: ఆధార్ కార్డులో సమస్యలున్నాయా..? ఈ ఒక్క నెంబర్‌కు ఫోన్‌ చేయండి చాలు..!
Aadhaar Updates
Follow us
Subhash Goud

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 03, 2022 | 7:36 AM

ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్‌ ఒకటి. ఇది లేనిది ఏ పని జరగదు. ప్రభుత్వ, ప్రైవేటు పథకాల నుంచి ఇతర చిన్నపాటి పనులకు కూడా ఆధార్‌ తప్పనిసరైంది. గతంలో ఆధార్‌ కార్డు కావాలన్నా, అందులో ఏమైనా మార్పు చేర్పులు చేయాలన్నా పెద్ద ప్రాసెస్‌ ఉండేది. కానీ టెక్నాలజీ పెరిగిపోయిన నేపథ్యంలో అన్ని సులభమైపోతున్నాయి. ఆధార్‌లో ఏవైనా తప్పులుంటే పెద్ద సమస్యగా మారేది. ఏ చిన్న మార్పులు చేయాలనుకున్న సులభంగా చేసుకునే వెసులు బాటు వచ్చేసింది.

ఇప్పుడు ఆధార్‌ కార్డులో ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే అప్‌డేట్‌ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక ఆధార్‌ తయారీ సంస్థ యూఐడీఏఐ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌ తెలిపింది. ఒక్క నెంబర్‌తో సమస్యను పరిష్కరించుకునే వెసులుబాటు తీసుకువచ్చింది. ఇందు కోసం యూఐడీఏఐ 1947 నంబర్‌ను తీసుకువచ్చింది. ఈ నెంబర్‌ ద్వారా 12 భాషల్లో సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఈ మేరకు యూఐడీఏఐ ట్విట్టర్‌లో తెలిపింది. ఈ నెంబర్‌తో తెలుగు, ఇంగ్లీష్‌, హింది, కన్నడ, తమిళం, మలయాళం, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, బెంగాలీ, అస్సామీ, ఉర్దూ భాషల్లో ఎంచుకునే అవకాశం ఉంటుంది. #Dial1947 నెంబర్‌కు డయల్‌ చేయడం ద్వారా మీకు నచ్చిన భాషను ఎంచుకుని సమస్యను పరిష్కరించుకోవచ్చు.

స్వాతంత్ర్యం వచ్చింది ఈ సంవత్సరంలోనే కాబట్టి యూఐడీఏఐ ఈ నెంబర్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డబ్బులు కట్టి ఆధార్ వివరాలను PVC కార్డుపై ప్రింట్ చేసి ఇచ్చే సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది యూఐడీఏఐ. అయితే ఆధార్‌ కార్డులు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి చాలా మందికి ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. కార్డులో పేరు, అడ్రస్‌ తప్పుగా పడటం, పుట్టిన తేదీ, ఫోన్‌ నెంబర్‌ తప్పుగా ఉండటం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నెంబర్‌ వల్ల ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకునే వెసులుబాటు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఎలాంటి ఛార్జీలు ఉండవు

ఈ నెంబర్‌కు డయాల్‌ చేసి సమస్యను పరిష్కరించుకోవడం వల్ల ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఈ నెంబర్‌ సోమవారం నుంచి శనివారం వరకు.. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటుందని కాల్‌ సెంటర్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇక ఆదివారాలలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ నెంబర్‌కు డయాల్‌ చేయడం వల్ల ఆధార్‌ నమోదు కేంద్రాలు, ఎన్‌రోల్‌మెంట్‌ తర్వాత ఆధార్‌ నెంబర్‌ స్టేటస్‌ తదితర సమస్యలకు సమాచారం తెలుసుకోవచ్చు. ఏవైనా తప్పులు ఉంటే ఎలా పరిష్కరించుకోవాలనే దానిపై కూడా సమాచారం తెలుసుకోవచ్చని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి