AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Warns: మీ కరెంటు బిల్లు కట్టలేదని మెసేజ్‌ వచ్చిందా? జాగ్రత్త.. కస్టమర్లను హెచ్చరించిన ఎస్‌బీఐ

టెక్నాలజీ పెరిగిపోతున్ననేపథ్యంలో సైబర్‌ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్‌ మోసాలు ఎన్నో జరుగుతున్నాయి. రోజురోజుకు కొత్త తరం మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. సైబర్‌ నేరగాళ్లు..

SBI Warns: మీ కరెంటు బిల్లు కట్టలేదని మెసేజ్‌ వచ్చిందా? జాగ్రత్త.. కస్టమర్లను హెచ్చరించిన ఎస్‌బీఐ
Cyber Fraud
Subhash Goud
| Edited By: Ram Naramaneni|

Updated on: Nov 03, 2022 | 7:35 AM

Share

టెక్నాలజీ పెరిగిపోతున్ననేపథ్యంలో సైబర్‌ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్‌ మోసాలు ఎన్నో జరుగుతున్నాయి. రోజురోజుకు కొత్త తరం మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. సైబర్‌ నేరగాళ్లు రకరకాలుగా మోసాలు పాల్పడేందుకు ఒడిగడుతున్నారు. కరెంటు బిల్లు పేరుతో ప్రజలకు మెసేజ్‌లు పంపి వారిని బలిపశువులను చేయడం ఇటీవలి కేసులు వెలుగులోకి వస్తున్నాయి. సామాన్య ప్రజలు ఇలాంటి మోసాల బారిన పడి తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) హెచ్చరిస్తోంది. మీ కరెంటు బిల్లు కట్టలేదని, ఇందుకు సంబంధించిన మీ మొబైల్‌ నెంబర్‌కు ఓ మేసేజ్‌ వచ్చిందని, వచ్చిన లింక్‌ను క్లిక్‌ చేయాలని, లేదా అందులో ఉండే కోడ్‌ను చెప్పాలని ఇలా రకరకాలుగా జనాలకు ఫోన్‌లు చేస్తూ మోసాల్లో పడేస్తున్నారు. ఏ మాత్రం జాగ్రత్తలు పాటించకుండా లింక్‌లను క్లిక్‌ చేస్తే మాత్రం ఇక అంతే సంగతి. మీ ఖాతాల్లో ఉన్న డబ్బులన్ని ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని ఎస్‌బీఐ హెచ్చరిస్తోంది. మీ ఫోన్ లేదా ఇమెయిల్‌లో ఏదైనా బిల్లు బకాయి ఉన్నట్టు సందేశం కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి అని ఎస్‌బిఐ తన కస్టమర్‌లకు సూచిస్తోంది. మీ మొబైల్‌కు ఎలాంటి మేసేజ్‌లు వచ్చినా పట్టించుకోవద్దని సూచిస్తోంది. ఇలాంటి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో రిప్లై ఇవ్వవద్దని చెబుతోంది.

మీరు కరెంటు బిల్లు చెల్లించనందున మీ కరెంటు కనెక్షన్ త్వరలో డిస్‌కనెక్ట్ చేయబడుతుందని చాలా మంది వాట్సాప్‌లో లేదా ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం అందుకుంటున్నారు. దీని కోసం మీరు ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచిస్తుంటే స్పందించవద్దని తెలిపింది. లేదా ఈ రోజు రాత్రి 8.30 గంటలకు మీ విద్యుత్‌ కనెక్షన్‌ను డిస్‌కనెక్ట్ చేయబడుతుంది. గత నెల కరెంటు బిల్లు రావడమే ఇందుకు కారణం. దయచేసి వెంటనే 8240471159కి కాల్ చేయండి అంటూ సందేశాలు వస్తే ఇది రాంగ్ నంబర్ అని గుర్తించాలని ఎస్‌బీఐ చెబుతోంది. ఈ నంబర్‌కు ఎప్పుడూ తిరిగి కాల్ చేయవద్దు సూచిస్తోంది. ఈ మేరకు ఎస్‌బీఐ ట్విట్టర్‌ ద్వారా కస్టమర్లను అప్రమత్తం చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి