PMSBY Scheme: ఏడాదికి 20 రూపాయలు చెల్లిస్తే రూ.2 లక్షల ప్రయోజనం.. దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

మోడీ ప్రభుత్వం దేశ ప్రజల కోసం రకరకాల పథకాలను ప్రవేశపెడుతోంది. అతి తక్కువ డిపాజిట్లతో వివిధ రకాల పథఖాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక ఆరోగ్య భద్రత విషయంలో..

PMSBY Scheme: ఏడాదికి 20 రూపాయలు చెల్లిస్తే రూ.2 లక్షల ప్రయోజనం.. దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
Pmsby Scheme
Follow us
Subhash Goud

|

Updated on: Nov 02, 2022 | 8:20 AM

మోడీ ప్రభుత్వం దేశ ప్రజల కోసం రకరకాల పథకాలను ప్రవేశపెడుతోంది. అతి తక్కువ డిపాజిట్లతో వివిధ రకాల పథఖాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక ఆరోగ్య భద్రత విషయంలో కూడా బీమా యోజన పథకాలను ప్రవేశపెడుతోంది. మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన పథకాల్లో ఆర్థిక భద్రత కల్పించే స్కీమ్‌లో కూడా ఎన్నో ఉన్నాయి. వీటిల్లో చేరడం వల్ల కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది. అలాంటి పథకాలలో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై) ఒకటి. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణిస్తే.. వారి కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకునేందుకు ఉపయోగపడుతుంది.

ఈ ప్రధాన్‌ మంత్రి సురక్ష బీమా యోజన స్కీమ్‌లో సంవత్సరానికి రూ.20 చెల్లిస్తే రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది. సురక్ష బీమా యోజన అనేది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇందులో చేరాలంటే బ్యాంకులు, పోస్టాఫీసులకు వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బీమా పాలసీ తీసుకుంటే పాలసీదారులు ఆటో డెబిట్‌ ఆప్షన్‌ పెట్టుకుంటే వారి అకౌంట్‌ నుంచి ప్రతి ఏడాది రూ.20 ఖాతా నుంచి నేరుగా కట్‌ అవుతాయి.

సురక్ష బీమా యోజన స్కీమ్‌లో ఉన్న వారు ప్రమాదవశాత్తు మరణిస్తే.. వారి కుటుంబాలకు రూ.2 లక్షల వరకు డబ్బులు లభిస్తాయి. అదే పాక్షికంగా అంగ వైకల్యం సంభవిస్తే రూ.1 లక్ష వరకు వస్తాయి. శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే రూ.2 లక్షలు లభిస్తాయి. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్లలోపు ఈ ప్రధాన్ మంత్రి సురక్ష బీమా స్కీమ్‌లో చేరవచ్చు.

ఇవి కూడా చదవండి

మీకు దగ్గరిలో ఉన్న బ్యాంక్‌కు వెళ్లి అంటే మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్రాంచుకు వెళ్లి ప్రధాన్ మంత్రి సురక్ష బీమా స్కీమ్‌లో చేరవచ్చు. ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలి. 70 ఏళ్లు దాటితే ఈ స్కీమ్ వర్తించదు. అలాగే ఎలాంటి డబ్బులు కూడా లభించవు. ఈ పాలసీ జూన్ 1 నుంచి మే 31 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి సంవత్సరం మే 31కి ముందు ప్రీమియం మొత్తం బ్యాంకు ఖాతా నుంచి ఆటో డిడక్ట్‌ చేయబడుతుంది. ఒక వేళ ఖాతా మూసివేయబడితే పాలసీ రద్దు అవుతుందని గుర్తించుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!