Gold Tax: ఇంట్లో ఎక్కువ బంగారం ఉంచుతున్నారా? ఎలాంటి పన్ను, నిబంధనలు ఉన్నాయి..!

విలువైన లోహమైన బంగారం ధర కాలక్రమేణా పెరుగుతూనే ఉంది. పండుగల సమయంలో చాలామంది బంగారం, బంగారు ఆభరణాలు , బంగారు నాణేలు కొని ఇంట్లో పెట్టుకుంటారు..

Gold Tax: ఇంట్లో ఎక్కువ బంగారం ఉంచుతున్నారా? ఎలాంటి పన్ను, నిబంధనలు ఉన్నాయి..!
Gold
Follow us
Subhash Goud

|

Updated on: Nov 01, 2022 | 7:00 AM

విలువైన లోహమైన బంగారం ధర కాలక్రమేణా పెరుగుతూనే ఉంది. పండుగల సమయంలో చాలామంది బంగారం, బంగారు ఆభరణాలు , బంగారు నాణేలు కొని ఇంట్లో పెట్టుకుంటారు. కొనుగోలు చేసిన బంగారాన్ని ఇంట్లో భద్రంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో ప్రభుత్వ నిబంధనలను తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒక వ్యక్తి ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు..? బంగారంపై ఎంత పన్ను చెల్లించాలి? బంగారాన్ని ఇంట్లో ఉంచుకోవడానికి ఎలాంటి నియమాలు ఉన్నాయో తెలుసుకోండి.

సీబీడీటీ ఏం చెబుతోంది..?

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) నియమాల ప్రకారం.. ఆదాయం నుండి లేదా మినహాయించబడిన వ్యవసాయ ఆదాయం, ఇంటి పొదుపు వంటి ఆదాయం నుండి కొనుగోలు చేసిన బంగారంపై పన్ను విధించబడదని పేర్కొంది. చట్టబద్ధంగా సంక్రమించిన బంగారం కూడా పన్ను రహితం. సోదాలు, తనిఖీల సమయంలో నిర్దేశించిన పరిమితుల్లో బంగారం లేదా ఆభరణాలను జప్తు చేయరాదని నిబంధన పేర్కొంది.

ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు?

నిబంధనల ప్రకారం.. వివాహిత మహిళ 500 గ్రాముల బంగారం లేదా ఆభరణాలను ఇంట్లో ఉంచుకోవచ్చు. పెళ్లికాని మహిళ 500 గ్రాముల వరకు బంగారం లేదా బంగారు ఆభరణాలను ఉంచుకోవచ్చు. పురుషులు 100 గ్రాముల బంగారాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు. అంతేకాకుండా, చట్టబద్ధంగా, అంటే ప్రకటించిన ఆదాయం నుండి కొనుగోలు చేసిన బంగారాన్ని ఇంట్లో ఉంచడానికి ఎటువంటి పరిమితి విధించబడలేదు.

ఇవి కూడా చదవండి

పన్ను ఎప్పుడు చెల్లించాలి?

ఇంట్లో బంగారాన్ని ఉంచడానికి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి. మీరు దానిని విక్రయించాలని నిర్ణయించుకున్నప్పుడు అది జరుగుతుంది. మూడేళ్లపాటు ఇంట్లో ఉంచిన బంగారంపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ) చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్ను రేటు పెట్టుబడి మొత్తానికి వర్తించినప్పుడు మీరు పొందే ఇండెక్సేషన్ ప్రయోజనంలో 20 శాతం. బంగారం కొనుగోలు చేసిన మూడేళ్లలోపు అమ్మితే, దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని వ్యక్తిగత ఆదాయంగా పరిగణిస్తారు. వ్యక్తిగత ఆదాయపు పన్నుకు కూడా ఇది వర్తిస్తుంది. సావరిన్ గోల్డ్ బాండ్లను విక్రయించినట్లయితే ఆ మొత్తం మీ ఆదాయానికి జోడించబడుతుంది. ఎంచుకున్న పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి. సావరిన్ గోల్డ్ బాండ్లను మెచ్యూరిటీ వ్యవధి వరకు ఉంచినట్లయితే లాభంపై పన్ను విధించబడదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి