AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI: ఎస్‌బీ క్రెడిట్‌ కార్డుదారులకు అలర్ట్.. నవంబర్‌ 15 నుంచి కొత్త రూల్స్‌

కొన్ని విషయాలలో నెలనెల కొత్త కొత్త నిబంధనలు అందుబాటులోకి వస్తుంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగంలో ఈ రూల్స్‌ ఎక్కువగా మారుతుంటాయి. అందుకే బ్యాంకు లావాదేవీలు ఎక్కువగా జరిపే..

SBI: ఎస్‌బీ క్రెడిట్‌ కార్డుదారులకు అలర్ట్.. నవంబర్‌ 15 నుంచి కొత్త రూల్స్‌
Subhash Goud
|

Updated on: Oct 31, 2022 | 8:00 AM

Share

కొన్ని విషయాలలో నెలనెల కొత్త కొత్త నిబంధనలు అందుబాటులోకి వస్తుంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగంలో ఈ రూల్స్‌ ఎక్కువగా మారుతుంటాయి. అందుకే బ్యాంకు లావాదేవీలు ఎక్కువగా జరిపే వారు ముందస్తుగా అప్రమత్తం కావడం మంచిది. నిబంధనలను పాటిస్తూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే ఆర్థిక నష్టంతో పాటు సమయం వృధా అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన క్రెడిట్‌ కార్డు కస్టమర్లకు షాకిచ్చింది. క్రెడిట్‌ కార్డుకు సంబంధించిన రెండు మార్పులను చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈఎంఐ లావాదేవీలపై ప్రస్తుతం ఉన్న ప్రాసెసింగ్‌ ఫీజును రూ.199 వరకు పెంచనుంది. అలాగే కొత్తగా రెండు చెల్లింపులపై ఛార్జీలను వసూలు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ నిబంధనలు నవంబర్‌15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు బ్యాంకు తెలిపింది. అలాగే తన కస్టమర్లకు మెసేజ్‌లను కూడా పంపుతోంది.

ఈఎంఐ ప్రాసెసింగ్‌ ఫీజుపై బాదుడు..

ఏదైనా వస్తువులను ఆన్‌లైన్‌లో గానీ, ఇతర మార్గాల ద్వారా కొనుగోలు చేసినప్పుడు ఈఎంఐగా మార్చినట్లయితే అందుకు బ్యాంకు కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంటుంది. ప్రస్తుతం రూ.99+జీఎస్టీని వసూలు చేస్తోంది. ఇక నవంబర్‌ 15వ తేదీ నుంచి ప్రాసెసింగ్‌ ఫీజు రూ.199+జీఎస్టీని వసూలు చేయనుంది. అంటే ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుదారులు ఏదైనా ఈఎంఐని మార్చితే ఈ ఫీజును వసూలు చేస్తుంది. అంతేకాకుండా ఇంటి అద్దె చెల్లింపుల లావాదేవీలపై ఇప్పటి వరకు ఎలాంటి ఫీజు వసూలు చేయడం లేదు. ఇక నుంచి దానిపై కూడా వసూలు చేయనుంది. రూ.99+జీఎస్టీని వసూలు చేయనుంది. ఈ ఛార్జీలు అన్ని నవంబర్‌ 15 నుంచి చేసేవారికి వర్తించనున్నట్లు తెలిపింది.

అద్దె చెల్లింపులపై రుసుము:

సాధారణంగా ఏదైనా చెల్లింపులు చేయాలంటే థర్డ్‌పార్టీ యాప్స్‌ పేటీఎంతో పాటు ఇతర యాప్స్‌ను ఎంచుకుంటాము. టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా మంది థర్డ్‌పార్టీ యాప్స్‌ను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. దీని వల్ల చెల్లింపులు సులభంగా అవుతున్నాయి. ఈ థర్డ్‌ యాప్స్‌తో క్రెడిట్ కార్డ్‌ల ద్వారా అద్దె చెల్లింపులు చేయడానికి ప్రజలను అనుమతిస్తాయి. ఈ థర్డ్-పార్టీ యాప్‌లు క్రెడిట్ కార్డ్‌ల ద్వారా అద్దె చెల్లింపులు చేసినందుకు రుసుమును కూడా వసూలు చేస్తాయి. ఇలా నవంబర్‌ 15 నుంచి ఈ రెండు అంశాలలో కీలక నిర్ణయం తీసుకుంది ఎస్‌బీఐ.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?