AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Deposit: ఈ ప్రభుత్వ బ్యాంకు తన కస్టమర్లకు శుభవార్త.. ఈ డిపాజిట్లు చేసిన వారికి అధిక ప్రయోజనం

ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు తమ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌ అందిస్తున్నాయి. వివిధ రకాల డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దీంతో ఖాతాదారులు మరింత వడ్డీ రేటును..

Bank Deposit: ఈ ప్రభుత్వ బ్యాంకు తన కస్టమర్లకు శుభవార్త.. ఈ డిపాజిట్లు చేసిన వారికి అధిక ప్రయోజనం
Bank Deposit
Subhash Goud
|

Updated on: Oct 31, 2022 | 5:50 AM

Share

ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు తమ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌ అందిస్తున్నాయి. వివిధ రకాల డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దీంతో ఖాతాదారులు మరింత వడ్డీ రేటును అందుకోవచ్చు. ఇక తాజాగా ఇండియన్ బ్యాంక్ కూడా తన కస్టమర్లకు శుభవార్త అందించింది. ప్రభుత్వ ఆధీనంలోని ఈ బ్యాంకు తన కస్టమర్లను ఆకర్షించేందుకు వడ్డీ రేట్లను భారీగా పెంచింది. బ్యాంకు కొత్త వడ్డీ రేట్లు రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వర్తిస్తాయని బ్యాంకు తెలిపింది. ఇది అక్టోబర్ 29 నుండి అమలులోకి వచ్చింది. ఈసారి ఈ పెంపుదల 0.90 శాతం పెరిగింది. 2 కోట్ల లోపు ఎఫ్‌డిపై ఈ సదుపాయం ఇవ్వనున్నట్లు బ్యాంక్ తెలిపింది. బ్యాంకు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీని చెల్లిస్తోంది. బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయంతో లక్షలాది మంది ఖాతాదారులు ప్రయోజనం పొందనున్నారు. ఈ వడ్డీ రేట్ల పెరుగుదల ఎక్కువగా ఉంది. అందుకే ఈ బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసినట్లయితే మంచి వడ్డీ రేటును పొందవచ్చు.

కొత్త వడ్డీ రేట్లను తెలుసుకోండి

☛ సాధారణ కస్టమర్ 7 రోజుల నుండి 29 రోజుల ఎఫ్‌డీలపై 2.80 శాతం వడ్డీ.

☛ సాధారణ కస్టమర్ 30 రోజుల నుండి 45 రోజుల ఎఫ్‌డీలపై 3.00 శాతం వడ్డీ.

ఇవి కూడా చదవండి

☛ సాధారణ కస్టమర్ 46 రోజుల నుండి 90 రోజుల ఎఫ్‌డీపై 3.25 శాతం వడ్డీని పొందుతారు.

☛ సాధారణ కస్టమర్ 91 రోజుల నుండి 120 రోజుల ఎఫ్‌డీపై 3.50 శాతం వడ్డీ.

☛ 121 రోజుల నుండి 180 రోజుల ఎఫ్‌డీలపై, సాధారణ కస్టమర్ 3.85 శాతం వడ్డీని పొందవచ్చు.

☛ సాధారణ కస్టమర్ 181 రోజుల నుండి 9 నెలల ఎఫ్‌డీలపై 4.50 శాతం వడ్డీ.

☛ సాధారణ కస్టమర్ 9 నెలల నుండి 1 సంవత్సరానికి ఎఫ్‌డీపై 4.75 శాతం వడ్డీ.

☛ సాధారణ కస్టమర్ 1 సంవత్సరానికి ఎఫ్‌డీపై 6.10 శాతం వడ్డీ.

☛ 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు ఎఫ్‌డీపై సాధారణ కస్టమర్ 6.30 శాతం వడ్డీని పొందుతారు.

☛ 2 సంవత్సరాల 1 రోజు నుండి 3 సంవత్సరాల వరకు ఎఫ్‌డీపై సాధారణ కస్టమర్ 6.50 శాతం వడ్డీ పొందవచ్చు.

☛ సాధారణ కస్టమర్ ఎఫ్‌డీపై 3 సంవత్సరాల 1 రోజు నుండి 5 సంవత్సరాల వరకు 6.40 శాతం వడ్డీని పొందుతారు.

☛ 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఎఫ్‌డీపై సాధారణ కస్టమర్లు 6.30 శాతం వడ్డీని పొందుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!
చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!
వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'
వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'