Palm Oil: సామాన్యులకు షాకిచ్చిన కేంద్రం.. మళ్లీ పెరగనున్న వంట నూనె ధరలు!

గతంలో వంట నూనె ధరలు షాకిచ్చాయి. నిత్యావసర సరుకుల ధరతో పాటు వంట నూనె ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నేపథ్యంలో..

Palm Oil: సామాన్యులకు షాకిచ్చిన కేంద్రం.. మళ్లీ పెరగనున్న వంట నూనె ధరలు!
Oil Price
Follow us
Subhash Goud

|

Updated on: Nov 02, 2022 | 5:50 AM

గతంలో వంట నూనె ధరలు షాకిచ్చాయి. నిత్యావసర సరుకుల ధరతో పాటు వంట నూనె ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నేపథ్యంలో ఈ ధరలు పెరగడం సామాన్యుడి జేబుకు చిల్లులు పడేలా చేశాయి. తర్వాత కేంద్రం అప్రమత్తమై వంట నూనె ధరలు దిగి వచ్చేలా చేశాయి. దాదాపు రూ.200 వరకు ఉన్న ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు షాకిచ్చింది. పామాయిల్ దిగుమతి సుంకాలను 6 నుంచి 11 శాతం పెంచనుంది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది కేంద్రం. ఆయిల్‌పై దిగుమతి సుంకాలు పెంపు నిర్ణయం కారణంగా వినియోగదారులపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కందుల గింజల ధరల కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమని కేంద్రం చెబుతోంది.

ముడి పామాయిల్‌ దిగుమతి సుంకం టన్నుకు 858 డాలర్ల నుంచి 952 డాలర్లకు పెరిగింది. ఆర్బీడీ పామాయిల్‌ దిగుమతి సుంకం టన్నుకు 905 డాలర్ల నుంచి 962 డాలర్లకు పెరిగింది. ఇక ఇతర పామాయిల్‌ టారిఫ్‌ కూడా పెరిగింది. టన్నుకు 882 డాలర్ల నుంచి 957 డాలర్లకు ఎగిసింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ధరల నియంత్రనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముడి పామాయిల్‌పై ప్రాథమిక దిగుమతి ట్యాక్స్‌ను రద్దు చేసింది. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఎడిబుల్‌ ఆయిల్స్‌, బంగారం, వెండి దిగుమతి ధరలను ప్రభుత్వం సవరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయిల్‌ దిగుమతి సుంకాలను పెంచడంతో ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రపంచంలోని అధిక మొత్తంలో ఆయిల్‌ను భారత్‌ రష్యా, ఉక్రెయిన్‌, ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి సరఫరా చేసుకుంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తతల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!