AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oil Purify Test: మీ వంట నూనెలో కల్తీ ఉందా..? ఈ సింపుల్‌ ప్రయోగంతో తెలుసుకోండి

ప్రతి ఒక్కరు వంటకాల్లో ఉపయోగించేది వంటనూనె. ఇది లేనిది వంట చేయడం కుదరదు. నూనె వంకాలను రుచిని మరింతగా పెంచుతాయి. వంటనూనె ధర ఎంత పెరిగినా.. కొనక తప్పదు. మన..

Oil Purify Test: మీ వంట నూనెలో కల్తీ ఉందా..? ఈ సింపుల్‌ ప్రయోగంతో తెలుసుకోండి
Oil Purify Test
Subhash Goud
|

Updated on: Nov 03, 2022 | 8:08 AM

Share

ప్రతి ఒక్కరు వంటకాల్లో ఉపయోగించేది వంటనూనె. ఇది లేనిది వంట చేయడం కుదరదు. నూనె వంకాలను రుచిని మరింతగా పెంచుతాయి. వంటనూనె ధర ఎంత పెరిగినా.. కొనక తప్పదు. మన వంటకాల్లో ఎక్కువగా ఉపయోగించేది నూనె. కొన్ని రోజులుగా వంట నూనె ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ధర ఎంత ఉన్నా.. కొనడం మాత్రం తప్పనిసరి. ఎందుకంటే నూనె లేనిదే వంటలు చేయలేము. ఒక వైపు ధరలు మండిపోతుంటే.. మరో వైపు కల్తీ నూనెలు మార్కెట్లోకి వస్తున్నాయి. నూనె లేనిదే వంట చేయని పరిస్థితి ఉంటుంది కాబట్టి అవసరాలను ఆసరా చేసుకుని కొందరు మోసగాళ్లు కల్తీ నూనెలు తయారు చేస్తూ మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.ప్రస్తుతం ఆహార పదార్థాల్లో కల్తీ అనేది ప్రధాన సమస్యగా మారింది.

కల్తీకి ఎంత చెక్‌ పెట్టినా.. ఏదో విధంగా మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. ఆహార కల్తీ వల్ల వివిధ వ్యాధులకు గురవుతున్నారు. అయితే నూనె కల్తీ ఉందా..? లేదా అనేది తెలుసుకోవడం ముఖ్యం. మన ఇంట్లోనే చిన్నపాటి ట్రిక్‌ వల్ల వంటల్లో నూనె కల్తీదా..? మంచిదా..? అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (ఫుడ్‌ సెఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆఫ్‌ ఇండియా) ఓ వీడియోను తయారు చేసి ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా ఆయిల్‌లో ట్రై ఆర్థో క్రెసిల్ ఫాస్ఫేట్‌ అనే రసాయనాన్ని ఉపయోగించి కల్తీ చేసేస్తున్నారు. ఇది ప్రధానంగా ఫాస్పరస్‌ను కలిగిన పెస్టిసైడ్‌. ఇది వాడడం వల్ల నాడీవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి పక్షవాతం తదితర రోగాలకు దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే మనం వాడే వంటనూనెలో ఏది స్వచ్ఛమైనది, ఏది కల్తీదో అనేది ఓ చిన్న ప్రయోగం ద్వారా తెలుసుకోవచ్చని చెబుతోంది ఫుడ్‌ సెఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆఫ్‌ ఇండియా( ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ).

కల్తీ నూనెను ఎలా గుర్తించాలి..?

కల్తీ నూనెను ఎలా గుర్తించాలో ఈ చిన్నపాటి ప్రయోగం ద్వారా తెలుసుకోవచ్చు. దీని వల్ల మీరు వాడే నూనెలో ట్రై-ఆర్థో-క్రెసిల్-ఫాస్ఫేట్‌ ఉంది అంటే అది కల్తీని అర్థం. నూనెలో అది ఉందో లేదో తెలుసుకోవాలంటే.. ముందుగా రెండు మి.లీటర్ల నూనెను రెండు చిన్న పాత్రల్లోకి తీసుకుని అందులో పసుపు రంగులో ఉన్న వెన్నను రెండింటిలోనూ వేయాలి. కొద్దిసేపటి తర్వాత పాత్రలోని నూనె రంగుమారకుండా ఉంటే అది స్వచ్ఛమైన నూనె ఉందని గుర్తించాలి. అందులో ట్రై-ఆర్థో-క్రెసిల్-ఫాస్ఫేట్‌ లేదని అర్థం. అదే నూనె రంగు మారి ఎరుపు రంగు మారితే అది కల్తీ అయినట్లు అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
జపాన్‌తో భారత్ ప్రత్యేకంగా క్రికెట్ మ్యాచ్ ఎందుకు ఆడుతోంది?
జపాన్‌తో భారత్ ప్రత్యేకంగా క్రికెట్ మ్యాచ్ ఎందుకు ఆడుతోంది?
మల్లెపూల పల్లకి సాంగ్‌లానే మరో పాపులర్ పాట..
మల్లెపూల పల్లకి సాంగ్‌లానే మరో పాపులర్ పాట..
పెరిగిన చికెన్ ధరలు.. అదే బాటలో కోడి గుడ్లు కూడా..
పెరిగిన చికెన్ ధరలు.. అదే బాటలో కోడి గుడ్లు కూడా..
ప్రతి రోజూ ఇది ఒక గిన్నెడు తింటే.. దెబ్బకు డయాబెటిస్ జారుకుంటాది
ప్రతి రోజూ ఇది ఒక గిన్నెడు తింటే.. దెబ్బకు డయాబెటిస్ జారుకుంటాది
'5 సార్లు మెయిన్స్.. 3 ఇంటర్వ్యూ.. 6వ ప్రయత్నంలో IPS అయ్యాడు'
'5 సార్లు మెయిన్స్.. 3 ఇంటర్వ్యూ.. 6వ ప్రయత్నంలో IPS అయ్యాడు'
తరచూ కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ ఆయుర్వేద చిట్కాలతో గ్యాస్, అజీర్తి
తరచూ కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ ఆయుర్వేద చిట్కాలతో గ్యాస్, అజీర్తి
దసరాకు సొంతూరు వెళ్తున్నాారా? రైల్వేశాఖ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్
దసరాకు సొంతూరు వెళ్తున్నాారా? రైల్వేశాఖ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్
వన్డే, టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదింది వీళ్లే
వన్డే, టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదింది వీళ్లే
మినప ఇడ్లీ కంటే 5 రెట్లు ఎక్కువ.. ఉదయాన్నే రెండు తింటే యవ్వనంగా
మినప ఇడ్లీ కంటే 5 రెట్లు ఎక్కువ.. ఉదయాన్నే రెండు తింటే యవ్వనంగా
ఇక తిప్పలు పడాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే 5 నిమిషాల్లో ఫ్యాన్..
ఇక తిప్పలు పడాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే 5 నిమిషాల్లో ఫ్యాన్..