ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

దేశ ప్రజలకు చల్లటి కబురు అందింది. ఎట్టకేలకు వారం ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. ఈ రుతుపవనాలు శనివారం కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మోహపాత్ర తెలిపారు. నేటి ఉదయం నుంచి కేరళలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడి నుంచి నెమ్మదిగా దక్షిణ, ఉత్తర భారత దేశానికి విస్తరించనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోకి ఈ నెల 11న ప్రవేశించనున్నాయి. 11న రాయలసీమ మీదుగా ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ […]

ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు
Follow us

| Edited By:

Updated on: Jun 08, 2019 | 6:45 PM

దేశ ప్రజలకు చల్లటి కబురు అందింది. ఎట్టకేలకు వారం ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. ఈ రుతుపవనాలు శనివారం కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మోహపాత్ర తెలిపారు. నేటి ఉదయం నుంచి కేరళలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడి నుంచి నెమ్మదిగా దక్షిణ, ఉత్తర భారత దేశానికి విస్తరించనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోకి ఈ నెల 11న ప్రవేశించనున్నాయి. 11న రాయలసీమ మీదుగా ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ నెల 13 నుంచి 15 మధ్య తెలంగాణలోకి ప్రవేశించనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో నాలుగు నెలల పాటు వర్షాలు కురుస్తాయి. గ్రామీణ భారతంలో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో వ్యవసాయానికి వర్షపునీరే ఆధారం కావడంతో రుతుపవనాల రాక రైతులకు ఆనందాన్నిస్తుంది. రుతుపవనాల రాకతో రానున్న రెండు రోజుల్లో కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జూన్‌ 9న కొల్లాం, అలప్పుళా జిల్లాలు, జూన్‌ 10న తిరువనంతపురం, ఎర్నాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆ ప్రాంతాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. మరోవైపు ఉత్తర, మధ్య భారతంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు.

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!