ఎగిసిన మంటలు.. గోవా ఎయిర్‌పోర్టు మూసివేత
గోవాలోని ఎయిర్‌పోర్టులో మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి యుద్ధ విమానం మిగ్ 29కె టేకాఫ్ తీసుకునే సమయంలో అందులో నుంచి ఇంధనం లీక్ అయ్యింది. దీంతో రన్‌వే మీద మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. చర్యలు తీసుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కాగా ఈ సంఘటనతో కొన్ని గంటల పాటు ఎయిర్‌పోర్టును మూసివేశారు. యుద్ధ విమానం కూడా సురక్షితంగానే ఉన్నట్లు వారు తెలిపారు. వీలైనంత త్వరగా అక్కడ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు ఏర్పాట్లను […]
గోవాలోని ఎయిర్‌పోర్టులో మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి యుద్ధ విమానం మిగ్ 29కె టేకాఫ్ తీసుకునే సమయంలో అందులో నుంచి ఇంధనం లీక్ అయ్యింది. దీంతో రన్‌వే మీద మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. చర్యలు తీసుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కాగా ఈ సంఘటనతో కొన్ని గంటల పాటు ఎయిర్‌పోర్టును మూసివేశారు. యుద్ధ విమానం కూడా సురక్షితంగానే ఉన్నట్లు వారు తెలిపారు. వీలైనంత త్వరగా అక్కడ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు ఏర్పాట్లను చేస్తున్నామని నేవీ ప్రతినిథి ఒకరు తెలిపారు.