Indian Railways: భారత రైల్వే గుడ్‌న్యూస్‌.. 1 రూపాయితో రూ.10 లక్షల ఉచిత బీమా సదుపాయం

రైలు ప్రయాణంలో ప్రమాదం జరిగి శాశ్వత వైకల్యం లేదా గాయాల కారణంగా ఆసుపత్రి పాలైనప్పుడు ప్రయాణికుల ఖర్చులను భరించేందుకు భారతీయ రైల్వే ఇటీవల కొత్త బీమా పథకాన్ని..

Indian Railways: భారత రైల్వే గుడ్‌న్యూస్‌.. 1 రూపాయితో రూ.10 లక్షల ఉచిత బీమా సదుపాయం
Indian Railways
Follow us
Subhash Goud

|

Updated on: Nov 04, 2022 | 6:50 AM

రైలు ప్రయాణంలో ప్రమాదం జరిగి శాశ్వత వైకల్యం లేదా గాయాల కారణంగా ఆసుపత్రి పాలైనప్పుడు ప్రయాణికుల ఖర్చులను భరించేందుకు భారతీయ రైల్వే ఇటీవల కొత్త బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రమాదాల్లో ప్రయాణికులు మరణిస్తే, వారిపై ఆధారపడిన వారికి, కుటుంబ సభ్యులకు ఆర్థికంగా మరింత బలాన్ని చేకూర్చడంతోపాటు వారు మరింతగా ఇబ్బంది పడకుండా ఉండాలనే లక్ష్యంతో రైల్వే శాఖ బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందు కోసం 10 లక్షల వరకు కవరేజ్‌ అందిస్తోంది. ఈ బీమాను రైల్వే శాఖ ఆపరేషనల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆఫ్ రైల్వేస్ కింద ప్రకటించింది. ఈ బీమా సేవలను అందించే కంపెనీల జాబితాను కూడా రైల్వే శాఖ ఖరారు చేసింది.

ఏ కంపెనీల బీమా సేవలు?

కొన్ని నెలల క్రితం బీమా సేవలను అందించడానికి రైల్వే శాఖ వేలం ప్రక్రియను నిర్వహించింది. దాదాపు 19 బీమా కంపెనీలు బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. వీటిలో శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లను బీమా ప్లాన్ సేవలను అందించడానికి రైల్వే శాఖ ఖరారు చేసింది. ప్రమాణాలను పాటించడంలో విఫలమైన మిగిలిన కంపెనీలను బిడ్డింగ్ ప్రక్రియ నుండి తొలగించారు.

ప్రయోజనాలు ఏమిటి?

రైల్వే శాఖ ఈ బీమా పథకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రయాణికులు టికెట్‌ తీసుకునే సమయంలో 1 రూపాయి చెల్లిస్తే ఈ బీమా సదుపాయం పొందవచ్చు. ప్రయాణంలో మరణిస్తే కుటుంబానికి 10 లక్షలు. శాశ్వత వైకల్యం ఏర్పడితే రూ.10 లక్షల వరకు పరిహారం లభిస్తుంది. పాక్షిక వైకల్యం అయితే రూ.7.5 లక్షలు, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరితే రూ.5 లక్షలు వరకు అందుబాటులో ఉంటుంది. మీరు మీ రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకునేటప్పుడు ఆ సమయంలో మీరు ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. మీరు యాప్ ద్వారా స్లీపర్ లేదా ఇతర రిజర్వేషన్ చేసినప్పుడు ఈ బీమా అందుబాటులో ఉంటుంది. మీరు ఆఫ్‌లైన్ రిజర్వేషన్ చేస్తే అంటే మీరు రైల్వే టికెట్ కౌంటర్ నుండి టికెట్ బుక్ చేస్తే ఫారమ్‌లో బీమా ఎంపిక ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

జాఫర్ vs మైకెల్ వాన్: మరోసారి ట్వీట్లు చేసుకున్న మాజీలు..
జాఫర్ vs మైకెల్ వాన్: మరోసారి ట్వీట్లు చేసుకున్న మాజీలు..
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వక్ర బుధుడి ప్రభావం.. ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి
వక్ర బుధుడి ప్రభావం.. ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి
ఈ చిన్నది ఇలా మారిపోయిందేంటీ సుధ..!
ఈ చిన్నది ఇలా మారిపోయిందేంటీ సుధ..!
మూడేళ్లల్లో ముచ్చటైన రాబడి.. ఆ రెండు బ్యాంకుల ఎఫ్‌డీలతోనే సాధ్యం
మూడేళ్లల్లో ముచ్చటైన రాబడి.. ఆ రెండు బ్యాంకుల ఎఫ్‌డీలతోనే సాధ్యం
ఉత్పన్న ఏకాదశి రోజున శ్రీ హరిని ఇలా పూజించండి.. స్వామి దయ మీ సొంత
ఉత్పన్న ఏకాదశి రోజున శ్రీ హరిని ఇలా పూజించండి.. స్వామి దయ మీ సొంత
చిరంజీవి, రామ్ చరణ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నయనతార
చిరంజీవి, రామ్ చరణ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నయనతార
లాభాల బాటలో యాపిల్ ఇండియా.. నికర లాభం ఎన్ని కోట్లంటే..?
లాభాల బాటలో యాపిల్ ఇండియా.. నికర లాభం ఎన్ని కోట్లంటే..?
జియోకు భారీ షాక్‌.. బీఎస్‌ఎన్‌ఎల్‌కు మంచి రోజులు..ట్రాయ్‌ నివేదిక
జియోకు భారీ షాక్‌.. బీఎస్‌ఎన్‌ఎల్‌కు మంచి రోజులు..ట్రాయ్‌ నివేదిక
తమన్‌ వర్సస్‌ దేవిశ్రీ.. మ్యూజికల్‌ వార్‌లో గెలిచేదెవరు.?
తమన్‌ వర్సస్‌ దేవిశ్రీ.. మ్యూజికల్‌ వార్‌లో గెలిచేదెవరు.?