Fact Check: లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి ఇండియన్‌ రైల్వే రూ.6000 ఇస్తోందా..? ఇందులో నిజమెంత?

భారతీయ రైల్వేలు ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటి. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. తక్కువ ఛార్జీలు ఉండటం కారణంగా సామాన్యులు సైతం రైలు..

Fact Check: లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి ఇండియన్‌ రైల్వే రూ.6000 ఇస్తోందా..? ఇందులో నిజమెంత?
Indian Railways
Follow us

|

Updated on: Nov 04, 2022 | 12:37 PM

భారతీయ రైల్వేలు ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటి. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. తక్కువ ఛార్జీలు ఉండటం కారణంగా సామాన్యులు సైతం రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా రైల్వేకు సంబంధించిన అనేక సమాచారాన్ని పొందుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో రైల్వేకు సంబంధించిన కొన్ని విషయాలు తరచూ వైరల్‌ అవుతున్నాయి. ఇందులో కొన్ని నివేదికలు తప్పుగా ఉంటున్నాయి. ఇలాంటి వాటిని నమ్మి చాలా మంది పోసపోతుంటారు. ఇక భారతీయ రైల్వే ప్రజలకు 6,000 రూపాయల బహుమతిని గెలుచుకునే గొప్ప అవకాశాన్ని కల్పిస్తోందని ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఇలాంటి సందేశం చూసినట్లయితే దానిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ చెబుతోంది. ఈ వైరల్‌ అవుతున్న సందేశాన్ని వాస్తవ-తనిఖీ చేసింది పీఐబీ. ఇందులో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది.

పీఐబీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌తో ఈ విషయంపై సమాచారాన్ని ఇచ్చింది. ఇండియన్‌ రైల్వే6,000 మందికి అవకాశం ఇస్తున్నట్లు, ఇందులో ప్రైజ్ మనీలో గెలుపొందవచ్చని వైరల్‌ అవుతోంది. ఈ సందేశాన్ని చూసిన చాలా మంది తమ వ్యక్తిగత వివరాలను పంచుకుంటున్నారు. ఇలాంటిది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇది పూర్తిగా నకిలీ లక్కీ డ్రా అని పీఐబీ తెలిపింది. ఏ వ్యక్తి తన వ్యక్తిగత సమాచారాన్ని ఈ విధంగా పంచుకోమని ఇవ్వదని, పొరపాటున ఇలా సమాచారం పంచుకుంటూ మోసపోయే ప్రమాదం ఉందని పీఐబీ హెచ్చరిస్తోంది.

ఇవి కూడా చదవండి

దీనితో పాటు డబ్బు విషయంలో ఏ వ్యక్తి నుండి ఎలాంటి వ్యక్తిగత వివరాలను రైల్వేలు డిమాండ్ చేయవని పీఐబీ ప్రజలను హెచ్చరించింది . ఆలోచించకుండా మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం మీకు చాలా హానికరం. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించి మీ బ్యాంకు ఖాతాను కూడా ఖాళీ చేయవచ్చు అని హెచ్చరించింది. ఇలాంటి ఫేక్ మెసేజ్‌ల పట్ల జాగ్రత్త వహించాలని పీఐబీ ఎల్లప్పుడూ ప్రజలకు సూచిస్తోంది.

ఈ వివరాలను తెలిపవద్దు

మీ ఆధార్ నంబర్, పాన్ వివరాలు, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించింది. అలాగే మీరు కాల్ లేదా సందేశం ద్వారా అలాంటి లాటరీని పొందలేరు. మీతో ఏదైనా సైబర్ మోసం జరిగితే, వెంటనే దాని గురించి బ్యాంకుకు తెలియజేయండి. దీనితో పాటు వీలైనంత త్వరగా మీ ఖాతాను స్తంభింపజేయండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..