Ration Card: ఆ రాష్ట్ర రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఈ నెలలో 150 కిలోల ఉచిత బియ్యం

దేశంలో రేషన్‌కార్డుదారులకు ఉచితంగా బియ్యాన్ని అందజేస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్‌ వరకు ఆ ఉచిత రేషన్‌ బియ్యం సరఫరా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు రేషన్ కార్డుదారులు..

Ration Card: ఆ రాష్ట్ర రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఈ నెలలో 150 కిలోల ఉచిత బియ్యం
Ration Card
Follow us
Subhash Goud

|

Updated on: Nov 05, 2022 | 7:51 AM

దేశంలో రేషన్‌కార్డుదారులకు ఉచితంగా బియ్యాన్ని అందజేస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్‌ వరకు ఆ ఉచిత రేషన్‌ బియ్యం సరఫరా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు రేషన్ కార్డుదారులు ఏకంగా 150 కిలోల వరకు ఉచిత రేషన్ బియ్యం అందుకోవచ్చు. కానీ దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు అనుకుంటే పొరపాటే. కేవలం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రజలు మాత్రమే ఈ ఉచిత రేషన్ బియ్యాన్ని అందుకోనున్నారు.  నవంబర్ నెలలో కార్డుదారులకు అధిక మొత్తంలో బియ్యాన్ని అందించనున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ప్రజలకు బంపర్ రైస్ అందుతుంది. నవంబర్‌లో రాష్ట్రంలోని బీపీఎల్ కుటుంబాలకు 45 కిలోల నుంచి 135 కిలోల వరకు బియ్యం అందుతాయి. ఈ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు పూర్తిగా ఉచితంగా అందజేస్తుంది. ఇది కాకుండా, రాష్ట్రంలోని ప్రాధాన్యత కలిగిన రేషన్ కార్డు హోల్డర్లకు 15 కిలోల నుండి 150 కిలోల బియ్యం లభిస్తుంది. రేషన్ కార్డుదారులకు ఈ బియ్యాన్ని పూర్తిగా ఉచితంగా అందజేయనున్నారు. అయితే ఈ బియ్యం కుటుంబ సభ్యుల ఆధారంగా బియ్యం పంపిణీ జరుగుతుంది.

కిలో రూ.10కి బియ్యం తీసుకోగా..

ఇక్కడ అక్టోబరు వరకు బీపీఎల్ కుటుంబాలు రూ.1కి, ఏపీఎల్ ప్రజలు రూ.10కి బియ్యం కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లో లాక్‌డౌన్ సమయంలో ఒక కుటుంబానికి గరిష్టంగా 85 కిలోల బియ్యం ఇచ్చారు. దేశంలోని ప్రజలకు డిసెంబర్ వరకు అదనంగా బియ్యాన్ని ఉచితంగా అందజేస్తామని మోదీ ప్రభుత్వం తరఫున ప్రకటించారు.

కుటుంబ సభ్యుల ప్రాతిపదికన:

కేంద్రం నుంచి బియ్యం పంపిణీ జరుగుతుందని, ఈ బియ్యాన్ని అక్టోబర్ నుంచి పంపిణీ చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. కానీ కొన్ని కారణాల వల్ల అక్టోబర్‌ నెల బియ్యం పంపిణీ కాలేదు. అక్టోబరు-నవంబర్ నెలలకు సంబంధించిన కేంద్ర కోటా బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏకకాలంలో పొందుతోంది. అటువంటి పరిస్థితిలో రేషన్ కార్డు ప్రకారం.. కేంద్రం అదనపు బియ్యం 5 నుండి 50 కిలోల వరకు పంపిణీ చేయబడుతుంది. ఎంత బియ్యం లభిస్తుందో కుటుంబ సభ్యుల ఆధారంగా ఇవ్వనున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందించే బియ్యం, కేంద్రం అందించే బియ్యం కలిపి అదనంగా పొందనున్నారు.

ఇవి కూడా చదవండి

కేంద్రం ద్వారా రెండు నెలల బియ్యం

ప్రాధాన్యత కార్డుపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ కోటా నుండి పంపిణీ చేయబడిన బియ్యంలో రేషన్ కార్డుదారులకు కుటుంబ సభ్యులను బట్టి 15 నుండి 150 కిలోల బియ్యం లభిస్తుంది. రెండు నెలల అదనపు బియ్యం, ఈ నెల బియ్యం ఒకేసారి పంపిణీ చేయడంతో బియ్యం పరిమాణం పెరిగింది. డిసెంబర్‌లో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా బియ్యం పంపిణీ చేయనున్నాయి.

బియ్యం పంపిణీలో దుకాణాల వద్ద అవాంతరాలు తలెత్తే అవకాశం ఉంది. ఈ మేరకు కొందరు దుకాణదారులకు నోటీసులు కూడా జారీ చేశారు అధికారులు. అందుకే ఈసారి రేషన్ బియ్యం ఎంత వస్తాయని ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఏయే రేషన్‌కార్డుదారులకు ఎంత బియ్యం అందజేస్తారనే సమాచారాన్ని రేషన్ దుకాణదారులు తమ దుకాణాల వెలుపల అతికించాలని కోరారు. వేలి ముద్ర సహాయంతో బియ్యాన్ని తీసుకోవాలని అధికారులు తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!