Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Triple Talaq: నీవు అంటే ఇష్టం లేదు.. మన పిల్ల నా గిప్ట్ అంటూ భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. ఎక్కడంటే

బాధిత మహిళ జైపూర్‌లోని రామ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో తన భర్తపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనకు సంబంధించి.. జూన్ నెలలో ఇదే విషయంపై కేసు నమోదు చేయబడిందని..

Triple Talaq: నీవు అంటే ఇష్టం లేదు.. మన పిల్ల నా గిప్ట్ అంటూ భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. ఎక్కడంటే
Triple Talaq
Follow us
Surya Kala

|

Updated on: Oct 30, 2022 | 8:17 PM

ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళల పట్ల జరిగే అన్యాయం జరుగుతూనే ఉంది. తాజాగా మరో ట్రిపుల్ తలాక్ కేసు వెలుగు లోకి వచ్చింది. తలాక్ పేరుతో తనను మోసం చేశాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందిన సమాచారం ప్రకారం.. మూడుసార్లు తలాక్ చెప్పి భార్యను తన కుటుంబ సభ్యుల ఎదుట ఆమె భర్త వదిలేశాడు. విడాకులు ఇచ్చిన తరువాత.. నీకు మన బిడ్డ నేను ఇచ్చిన బహుమతిగా భావించు అని ఆ భర్త భార్యను కోరాడు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. బాధిత మహిళ జైపూర్‌లోని రామ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో తన భర్తపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనకు సంబంధించి.. జూన్ నెలలో ఇదే విషయంపై కేసు నమోదు చేయబడిందని.. అప్పుడు ఇరువర్గాలను పిలిచి రాజీ కుదిర్చినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు భర్త తనను బయటకు నెట్టాడని మహిళ మళ్లీ ఆరోపించింది.

ఘట్‌గేట్ ప్రాంతంలో నివసిస్తున్న 26 ఏళ్ల వివాహిత ట్రిపుల్ తలాక్‌పై ఫిర్యాదు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ భూరి సింగ్ తెలిపారు. జూన్ 7, 2022 న, రామ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో భర్త, అత్తపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అప్పుడు ఆగష్టు 5 న భర్త , అతని స్నేహితులు ఎటువంటి గొడవ లేకుండా రాజీ చేసుకోవాలని కోరారని మహిళ ఫిర్యాదులో పేర్కొంది.

అప్పుడు తనకు, తన బిడ్డకు ఎలాంటి అన్యాయం జరగదని హామీ ఇచ్చారని ఆ మహిళ చెప్పింది. విచారణ సమయంలో కేసు రాజీ కోసం రూ.500 స్టాంపుపై సంతకం కూడా తీసుకున్నారని ఆ మహిళ ఆరోపించింది.

ఇవి కూడా చదవండి

రాజీపడిన అనంతరం మళ్లీ ఇప్పుడు తన భర్త.. తన తల్లి ,.. నిన్ను కోరుకోవడం లేదని భర్త చెప్పాడని.. అందుకే తనను ఇంట్లో ఉంచుకోలేక అద్దె ఇంట్లో ఉంచాడని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. కొన్ని రోజుల తర్వాత పెహార్ వదిలి వెళ్లిపోయినట్లు చెప్పింది. అంతేకాదు.. తన భర్త తనను వదిలి వెళ్లే సమయంలో నీవు అంటే నాకు ఇష్టం లేదు… నాకు విడాకులు ఇచ్చి వదిలిపెట్టకుంటే భూమిలో వాటా రాదని తన భర్త భయపెట్టాడని.. పేర్కొంది.

అదే సమయంలో.. నా బిడ్డకు అన్యాయం జరిగింది. తాను నా గిఫ్ట్ గా నువ్వు బాగా చూసుకో అంటూ భార్యకు భర్త జాగ్రత్తలు చెప్పినట్లు పేర్కొంది. తన భర్త.. అతని తల్లి ఎదుట మూడుసార్లు తలాక్ చెప్పి మోస పూరితంగా వదిలించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది ఆ భార్య..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..