AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sidhu Moose Wala: కొడుకుని పోగొట్టుకున్న ఓ తండ్రి బాధ.. నా కొడుకు హత్య విషయంలో న్యాయం జరగడం లేదు.. దేశం విడిచి వెళ్ళిపోతా..

ముసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ చేసిన తాజా ప్రకటన తెరపైకి వచ్చింది. తమ కుమారుడి హత్య విషయంలో తమకు  ఇంకా న్యాయం జరగలేదని.. అందుకే తాము భారతదేశం వదిలి వెళ్లిపోతున్నామని చెప్పాడు. అంతేకాదు.. ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌ను ఉపసంహరించుకోనున్నామని తెలిపాడు ముసేవాలా తండ్రి  బల్కౌర్ సింగ్. 

Sidhu Moose Wala: కొడుకుని పోగొట్టుకున్న ఓ తండ్రి బాధ.. నా కొడుకు హత్య విషయంలో న్యాయం జరగడం లేదు.. దేశం విడిచి వెళ్ళిపోతా..
Sidhu Moosewala Murder Case
Surya Kala
|

Updated on: Oct 30, 2022 | 7:25 PM

Share

ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు సిద్ధూ మూసేవాలా దారుణ హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే పోలీసులు కొందరు నిందితులను అరెస్ట్ చేశారు.. అయితే తాజాగా మరోసారి ఈ కేసులో సంచలన వార్తలు వినిపిస్తున్నాయి. సిద్ధూ మూసేవాలా హత్య విషయంలో తమకు న్యాయం జరగలేదని అతని కుటుంబం ఆరోపించింది. అందుకనే తాము భారతదేశం వదిలి వెళ్లిపోతానని పేర్కొంది. ముసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ చేసిన తాజా ప్రకటన తెరపైకి వచ్చింది. తమ కుమారుడి హత్య విషయంలో తమకు  ఇంకా న్యాయం జరగలేదని.. అందుకే తాము భారతదేశం వదిలి వెళ్లిపోతున్నామని చెప్పాడు. అంతేకాదు.. ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌ను ఉపసంహరించుకోనున్నామని తెలిపాడు ముసేవాలా తండ్రి  బల్కౌర్ సింగ్.

మీడియా నివేదికల ప్రకారం.. నవంబర్ 25 తర్వాత తన కుటుంబంతో కలిసి భారతదేశం విడిచిపెడతానని, తన కొడుకు హత్యకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను కూడా ఉపసంహరించుకుంటానని బాల్కౌర్ సింగ్ పేర్కొన్నాడు. తమ కుమారుడు హత్య విషయంలో న్యాయం చేయడంలో పోలీసులు కూడా విఫలమయ్యారని.. తీవ్ర ఆరోపణలు చేశారు. పథకం వేసిమరీ తన కుమారుడిని హత్య చేశారని బల్కౌర్ సింగ్ తెలిపారు. అయితే దీనిని గ్యాంగ్ వార్ ఘటనగా చూపించాలని పోలీసులు భావిస్తున్నారు. తన సమస్యలు చెప్పుకునేందనుకు డీజీపీని సమయం కోరాను.. న్యాయం జరుగుతుందేమో ఒక నెల రోజులు చూస్తాను.. అప్పటికీ న్యాయం జరగకపోతే.. తన కొడుకు హత్య కు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఉపసంహరించుకుంటానని.. అప్పుడు దేశం విడిచి వెళ్లిపోతామని స్పష్టం చేశాడు బల్కౌర్ సింగ్.

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌:

ఇవి కూడా చదవండి

లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడిని అరెస్టు చేసినట్లు చండీగఢ్ పోలీసులు శనివారం తెలిపారు. పోలీసులు విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, అరెస్టయిన మోహిత్ భరద్వాజ్ (32) వద్ద నుండి అమెరికాలో తయారైన పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్యాంగ్‌స్టర్ దీపక్ టినుతో మోహిత్ సన్నిహితంగా ఉండేవాడని పోలీసులు తెలిపారు. టిను మాన్సా పోలీసు కస్టడీ నుండి తప్పించుకున్నాడు. అయితే అతన్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. పంజాబీ గాయకుడు సిద్ధు ముసేవాలా హత్య కేసులో టిను నిందితుడు. గ్యాంగ్‌స్టర్ సంపత్ నెహ్రాతో మోహిత్ చదువుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ  కోణంలో తదుపరి విచారణ చేయనున్నామని చెప్పారు.

అంతకుముందు, పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో పంజాబీ నేపథ్య గాయని అఫ్సనా ఖాన్‌ను ప్రశ్నించారు. వాస్తవానికి, ఈ కేసులో, అఫ్సనా ఖాన్ ప్రమేయంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆమెకు సమన్లు ​​పంపింది. ఎన్‌ఐఏ మంగళవారం ఈ కేసులో అఫ్సనాను 5 గంటల పాటు ప్రశ్నించింది. సమాచారం ప్రకారం, అఫ్సనా మూసేవాలా తనను సిద్ధూ మూసేవాలా సోదరిగా భావించేవాడని చెప్పినట్లు తెలుస్తోంది.  హత్య కేసుకు సంబంధించిన గ్యాంగ్‌స్టర్ల గురించి అఫ్సానా నుండి NIA సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ముసేవాలా హత్య కేసులో అఫ్సానా ఖాన్‌ పాత్ర ఉందని ఎన్‌ఐఏ అనుమానిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..