- Telugu News Photo Gallery Sports photos ATKMB vs EBFC: Shocking! Fan passes away midway during Kolkata Derby as Mohun Bagan beat East Bengal 2 0
ATKMB vs EBFC: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో షాకింగ్ ఘటన, స్టేడియంలో అభిమాని గుండెపోటుతో మృతి, శోకసంద్రంలో ప్రేక్షకులు
ఐఎస్‌ఎల్‌లో భాగంగా కోల్‌కతా డెర్బీ మ్యాచ్ సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగింది. మ్యాచ్ చూసేందుకు 62 వేల మంది అభిమానులు స్టేడియంకు చేరుకున్నారు. లైవ్ మ్యాచ్ చూస్తున్న సమయంలో అభిమాని మరణించాడు.
Updated on: Oct 30, 2022 | 3:45 PM

ISL 2022-23లో అత్యంత ఉత్తేజకరమైన మ్యాచ్ శనివారం జరిగింది. ఈస్ట్ బెంగాల్ , మోహన్ బగాన్ జట్లు సాల్ట్ లేక్ స్టేడియంలో తలపడ్డాయి. ఈ రెండు జట్లు తలపడుతుండే... చూడటానికి వేలాది మంది ప్రజలు స్టేడియం వద్దకు చేరుకున్నారు. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఓ అభిమాని గుండెపోటుకు గురయ్యాడు. ఓ వైపు మ్యాచ్ ఉత్కంఠగా మారింది.

కోల్‌కతా నివాసి జైశంకర్ సాహా మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి చేరుకున్నారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఫస్ట్ హాఫ్ లోనే కేవలం 15 నిమిషాలకే జైశంకర్‌కు గుండెపోటు వచ్చింది. చుట్టుపక్కల ఉన్నవారు అతడిని స్టేడియం నుంచి ఆస్పత్రికి తరలించారు.

జైశంకర్ నోటి నుంచి రక్తం కారుతోంది. అది చూసి అభిమానులు వేంటనే అక్కడ ఉన్న సిబ్బందికి సమాచారం అందించారు. కోల్‌కతా పోలీసులు అతన్ని అమ్రీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు జై శంకర్ ను కాపాడడానికి తమ శాయశక్తులా ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆసుపత్రికి చేరిన 37 నిమిషాలకే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు సంతాపం తెలిపారు.

ఈస్ట్ బెంగాల్ డైరెక్టర్ దేబ్రతా సర్కార్ ఉదయాన్నే జైశంకర్ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను కలిశారు. కుటుంబానికి అన్ని విధాలా సాయం చేస్తానని కూడా చెప్పారు. 31 ఏళ్ల అభిమాని మృతి పట్ల క్లబ్‌కు విచారం వ్యక్తం చేశారు.

మ్యాచ్ విషయంలోకి వెళ్తే.. మోహన్ బగన్.. ఈస్ట్ బెంగాల్ పై 2-0తో మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌ని చూసేందుకు 60 వేల మందికి పైగా చేస్టేడియంకు చేరుకున్నారు. ఈ సీజన్‌లో ఐఎస్‌ఎల్‌లో ఇదే రికార్డు. అంత రద్దీ కారణంగానే జై శంకర్ కు అకస్మాత్తుగా గుండె పోటు వచ్చినట్లు వైద్యులు చెబుతున్నారు




