AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inspiration Woman: భర్తకు అండగా నిలబడాలనుకున్న భార్య.. జమ్మూకశ్మీర్ లో మొదటి మహిళా ఆటో డ్రైవర్ గా రికార్డ్

జమ్మూ డివిజన్‌లోని నగ్రోటా ప్రాంతానికి చెందిన సీమా దేవి తమ ఇంటి ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంది. తన భర్తకు ఆర్ధికంగా అండగా నిలబడాలని కోరుకుంది.. అందుకు ఏవిధంగా తాను ముందుకు వెళ్ళాలా అని ఆలోచించింది.

Inspiration Woman: భర్తకు అండగా నిలబడాలనుకున్న భార్య.. జమ్మూకశ్మీర్ లో మొదటి మహిళా ఆటో డ్రైవర్ గా రికార్డ్
Jammu First Woman Auto Driv
Surya Kala
|

Updated on: Nov 03, 2022 | 1:09 PM

Share

మహిళలు ఆకాశంలో అవకాశాల్లో సగం.. అన్నింటా సమానమే అని నిరూపిస్తున్నారు. అంతరిక్షంలో సంచరిస్తున్నారు. సముద్రం లోతులను కొలుస్తున్నారు.. తాము మగవారికంటే ఎందులోనూ తక్కువ కామంటూ బస్సు, లారీలు వంటి భారీ వాహనాలు నడపడే కాదు.. విమానాలను నడుపుతున్నారు.. కార్మికులు గా పనిచేస్తున్నారు. తమ కుటుంబ బాధ్యతలను పంచుకుంటూ.. ఆర్ధికంగా భర్తగా అండగా నిలబడుతున్నారు. అయితే జమ్మూ కాశ్మీర్ లో నిన్నా మొన్నటి వరకూ పరిస్థితులు వేరుగా ఉండేవి.. కానీ ఇప్పుడు అక్కడ స్థానిక మహిళలు కూడా ఇప్పుడిప్పుడే తమ గళం విప్పుతున్నారు. తమ ప్రతిభకు పదును పెడుతూ.. కష్టాన్ని ఇష్టంగా పడుతున్నారు. తాజాగా ఓ మహిళా ఏకంగా ఆటోడ్రైవర్ గా మారి.. రికార్డ్ సృష్టించింది. భర్తకు ఆర్ధికంగా అండగా ఉండడం కోసం జీవనోపాధిగా డ్రైవర్ గా మారింది.. జమ్మూలో మొదటి మహిళా ఇ-రిక్షా డ్రైవర్ గా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే..

జమ్మూ డివిజన్‌లోని నగ్రోటా ప్రాంతానికి చెందిన సీమా దేవి తమ ఇంటి ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంది. తన భర్తకు ఆర్ధికంగా అండగా నిలబడాలని కోరుకుంది.. అందుకు ఏవిధంగా తాను ముందుకు వెళ్ళాలా అని ఆలోచించింది. చివరకు ఇ-రిక్షా సీమా దేవి దృష్టికి వచ్చింది. దీంతో జీవనోపాధి కోసం ఇ-రిక్షా డ్రైవర్ గా మారింది. జమ్మూ కశ్మీర్ లో మొదటి మొదటి మహిళా ఇ-రిక్షా డ్రైవర్ గా చరిత్ర సృష్టించింది సీమా దేవి.

ఇదే విషయంపై సీమా స్పందిస్తూ.. తమకు ముగ్గురు పిల్లలని.. దీంతో తన భర్తకు ఆర్థికంగా అండగా నిలబడాలనే కోరికతో ఈ  నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అంతేకాదు తాను ఈ రిక్షా డ్రైవర్ గా  కొన్ని అడ్డంకులను ఎదుర్కొన్నట్లు పేర్కొంది. అయితే కొంతమంది ప్రయాణీకులు తనను మొదట్లో వింతగా చూసేవారని.. మరొకొందరు భయపడేవారని చెప్పారు సీమ.. అయితే ప్రయాణీకుల భయాందోళనలను అధిగమించి.. వారి నమ్మకం దక్కేవరకూ ప్రయాణం ఉత్సాహంగా సాగలేదని పేర్కొంది. అయితే ఇప్పుడు తనకు ఆదాయం బాగుందని..తాను తీసుకున్న నిర్ణయంతో తన ఫ్యామిలీ ఎంతో సంతోషముగా ఉందని తెలిపింది సీమా. ఇప్పడు తన నిర్ణయానికి తన కుటుంబం మద్దతునిస్తుందని ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది.

ఇవి కూడా చదవండి

ఇదే విషయంపై స్థానికులు స్పందిస్తూ.. తమకు, తమ కుటుంబానికి జీవనోపాధిని కల్పించాలని కోరుకునే ఇతర మహిళలకు సీమ స్ఫూర్తిగా నిలుస్తుందని  చెబుతున్నారు. సీమా దైర్యం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..