Yadagirigutta: తిరుమల తరహాలో యాదాద్రిలో బ్రేక్ దర్శనం .. నేటి నుంచి అమలు.. రోజులో రెండు సార్లు ప్రత్యేక దర్శనం
ఈ బ్రేక్ దర్శన సమయంలో ఉచిత దర్శనం, రూ.150 టికెట్ దర్శనం నిలిపివేయనున్నారు. బ్రేక్ దర్శనంలో వచ్చే భక్తులకు స్వయంభూ మూర్తుల దర్శనంతోపాటు గర్భాలయంలో హారతిని ఇవ్వనున్నారు
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నేటి నుంచి బ్రేక్ దర్శన సదుపాయం అమల్లోకి వచ్చింది. తిరుమల తిరుపతి తరహాలో వీవీఐపీ, వీఐపీలకు ప్రత్యేకమైన దర్శనాన్ని రోజు రోజు సార్లు కల్పించనున్నారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బ్రేక్ దర్శనం అందుబాటులోకి వచ్చింది. స్వామి వారి దర్శనానికి వచ్చే వీఐపీ.. వీవీఐపి భక్తులకు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తుల సిఫార్సులపై వచ్చే భక్తులకు 300 రూపాయల టికెట్ తో బ్రేక్ దర్శనం కల్పించనున్నారు ఆలయాధికారులు.
ఈ బ్రేక్ దర్శన సమయంలో ఉచిత దర్శనం, రూ.150 టికెట్ దర్శనం నిలిపివేయనున్నారు. బ్రేక్ దర్శనంలో వచ్చే భక్తులకు స్వయంభూ మూర్తుల దర్శనంతోపాటు గర్భాలయంలో హారతిని ఇవ్వనున్నారు. లక్ష్మీనరసింహ స్వామివారి ప్రధానాలయ ఉత్తర పంచతల రాజగోపురం మీదుగా ఈశాన్య ప్రాంతంలో నిర్మించిన బయట ప్రాకార మండపంలో బ్రేక్ దర్శనానికి కావాల్సిన క్యూ లైన్లను ఏర్పాటు చేశారు ఆలయాధికారులు.. త్రితల రాజగోపురం మీదుగా స్వామివారి ఆలయంలోకి ప్రవేశించే విధంగా బ్రేక్ దర్శన క్యూలైన్లను ఏర్పాటు చేశారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..