Srisailam: భక్తులతో కిక్కిరిసిన శ్రీశైల మల్లన్న క్షేత్రం.. ముక్కంటిశుని దర్శనానికి ఐదు గంటల సమయం

కార్తీక మాసంలోని సోమవారం భోళాశంకరుడిని అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు. ఈ మాసం దానధర్మాలు చేస్తే పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈరోజు కార్తీకమాసం తొలి సోమవారం.

Srisailam: భక్తులతో కిక్కిరిసిన శ్రీశైల మల్లన్న క్షేత్రం.. ముక్కంటిశుని దర్శనానికి ఐదు గంటల సమయం
huge devotees rush at srisailam mallanna temple
Follow us
Surya Kala

|

Updated on: Oct 31, 2022 | 11:35 AM

మాసాల్లోకెల్లా కార్తీక మాసం అత్యంత పవిత్రమైందని ప్రసిద్ధి. కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు. మహిమాన్వితమైన కార్తీక మాసం శివ కేశవులకి ప్రీతికరమైన మాసం. ఈ నెలలో దేశం నలుమూలలా ఉన్న శివాలయాలు భక్తులతో కిటకిటలాడతాయి. శివయ్యకు రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్ర పూజలు విశేషంగా నిర్వహిస్తారు. ఇక కార్తీక మాసంలోని సోమవారం భోళాశంకరుడిని అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు. ఈ మాసం దానధర్మాలు చేస్తే పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈరోజు కార్తీకమాసం తొలి సోమవారం. దీంతో తెల్లవారు జామునుంచే భక్తులు శివాలయాల వద్ద బారులు తీరారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. వివరాల్లోకి వెళ్తే..

శ్రీశైలంలో కార్తీకమాస మొదటి సోమవారం మల్లన్నకు ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది శ్రీ భ్రమరాంబ మల్లికార్జును స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పడుతుంది భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద, ఉత్తర శివమాడవీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు.

కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో భక్తులందరికి స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు అలానే నేటి సాయంత్రం కార్తీక మొదటి సోమవారం పురస్కరించుకుని ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు