Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Masam: శివాలయాల్లో కార్తీక సోమవారం సందడి.. శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న శైవక్షేత్రాలు

కార్తీక మాసం తొలి సోమవారంకావడంతో కావడంతో శైవ క్షేత్రాల సహా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మరోవైపు పవిత్ర గోదావరి, కృష్ణా నదుల్లో భక్తులు స్నానమాచరించి కార్తీక దీపాలను వెలిగించారు.. శివయ్యకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.

Karthika Masam: శివాలయాల్లో కార్తీక సోమవారం సందడి.. శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న శైవక్షేత్రాలు
Karthika Somavaram
Follow us
Surya Kala

|

Updated on: Oct 31, 2022 | 8:09 AM

కార్తీక మాసం తొలి సోమవారం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో భక్తుల సందడి నెలకొంది. శివాలయాలకు భక్తులు పోటెత్తారు. మొదటి సోమవారం కావడంతో తెల్లవారుజామునుండి భక్తుల రద్దీ నెలకొంది. పంచారామ క్షేత్రాల్లో సహా కోటప్పకొండ త్రికోటేశ్వేర స్వామి ఆలయంలో భక్తులు బారులు తీరారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. మరోవైపు అమరావతి అమరేశ్వరాలయం లో కార్తీకసోమవారం సందడి నెలకొంది. భక్తులు పవిత్ర కృష్ణానది స్నానమాచరించి.. కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు.  భక్తులు శివనామస్మరణతో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి పుష్కర ఘాట్ భక్తులతో కిటకిటలాడింది.. పుష్కర ఘాట్లో స్నానాలకు బారులు తీరారు స్థానికులు, భక్తులు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి గోదావరి స్నానం ఆచరించి గోదావరిలో దీపాలు వదిలేందుకు పెద్ద ఎత్తున క్యు కట్టారు భక్తులు. రాజమండ్రి నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రాజమండ్రి పుష్కర ఘాట్ కు వచ్చి గోదావరి నదిలో స్నానమాచరిస్తున్నారు భక్తులు. జిల్లాలో మార్కండేయ స్వామి ఆలయం మహాకాళేశ్వర్ టెంపుల్, ద్రాక్షారామ భీమేశ్వరాలయం, అన్నవరం సత్యదేవుని ఆలయాలు మొదటి కార్తీక సోమవారం కావడంతో భక్తులతో శివనామ స్మరణతో మారుమగుతున్నాయి.

ద్రాక్షారామ శ్రీ మాణి క్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయంకి ఉదయం నుండే భీమేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించి భక్తులు అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణు గోపాలకృష్ణ సతీసమేతంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున నుంచి శ్రీ స్వామి వారిని, శ్రీ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి పూజలు నిర్వహిస్తున్నారు. శివనామ స్మరణతో భీమేశ్వర స్వామి ఆలయం మారుమ్రోగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..