Tamilnadu Rain: తమిళనాడులో రికార్డు స్థాయిలో వర్షపాతం.. నీట మునిగిన సీఎం ప్రాతినిధ్యం ప్రాంతం.. స్టాలిన్ అత్యవసర సమావేశం

చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగెల్‌పేట, నాగపట్నం, తంజావూరు, తిరువారూరు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చిదంబరం లో యూనివర్సిటీ లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సీఎం స్టాలిన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొరట్టూరు ప్రాంతం పూర్తిగా నీట మునిగింది.

Tamilnadu Rain: తమిళనాడులో రికార్డు స్థాయిలో వర్షపాతం.. నీట మునిగిన సీఎం ప్రాతినిధ్యం ప్రాంతం.. స్టాలిన్ అత్యవసర సమావేశం
Tamilnadu Rains
Follow us
Surya Kala

|

Updated on: Nov 03, 2022 | 2:04 PM

తమిళనాడులో మూడు జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. చెన్నై, చెంగలపట్టు, కాంచీపురం ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్ర రాజధాని చెన్నై సహా సమీప ప్రాంతాలు రెడ్ హిల్స్, పొన్నెరీ, గుమ్మిడిపూడి ప్రాంతాలు జలమయం అయ్యాయి.  కాంచీపురం లో 21 సెంటి మీటర్లు , చెన్నై అవడి 18 సెంటమీటర్లు వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర చెన్నైలోని రద్దీగా ఉండే ప్రాంతాలతో పాటు నగర దక్షిణ ప్రాంతాలు, శివారు ప్రాంతాలలో నీటి ఎద్దడి ఏర్పడింది. తేని పుడుక్కోటై, తిరువారూరు, నాగపట్నం, కడలూరు , మైలాడు దురై జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ఎమెర్జెన్సీ విధించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. వరద ప్రభావ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగెల్‌పేట, నాగపట్నం, తంజావూరు, తిరువారూరు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చిదంబరం లో యూనివర్సిటీ లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సీఎం స్టాలిన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొరట్టూరు ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. సీఎం స్టాలిన్  అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. వరద సహాయకోసం తీసుకోవలసిన చర్యల గురించి చర్చించారు.

పూండి, చెంబరంబాక్కం డ్యామ్‌ల నుంచి నీటి విడుదల: 

ఇవి కూడా చదవండి

రిజర్వాయర్లలోకి వచ్చే ఇన్ ఫ్లోలను బట్టి విడుదల చేయాల్సిన నీటి పరిమాణాన్ని పెంచుతామని తిరువళ్లూరు జిల్లా యంత్రాంగం తెలిపింది. ఒడ్డున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అక్టోబరు 29న ప్రారంభమయ్యే ఈశాన్య రుతుపవనాల కారణంగా 11,757 ఎంసీఎఫ్‌టీల సామర్థ్యంతో పూండి, చోళవరం, రెడ్‌హిల్స్, కన్నంకోట్టై థెర్వోయ్‌కండిగై, చెంబరంబాక్కం డ్యామ్‌లలో నీటి మట్టం వేగంగా నిండుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్