Monkeys: ఒకే ఒక్కడు.. నాలుగు కోతులు..కట్ చేస్తే అదిరిపోయే సీన్..
ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు సోషల్ మీడియాతోనే సహజీవనం. ఒక్మ క్షణం కూడా దాన్ని విడిచి ఉండలేని దుస్థితి మనది. చిన్నా పెద్దా ఆడా మగా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ..
ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు సోషల్ మీడియాతోనే సహజీవనం. ఒక్మ క్షణం కూడా దాన్ని విడిచి ఉండలేని దుస్థితి మనది. చిన్నా పెద్దా ఆడా మగా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ లో దూరిపోతున్నారు. గంటలకు గంటలకు విలువైన సమయం గడిపేస్తున్నారు. సోషల్ మీడియా చాలా అద్భుతాలతో కూడిన విభిన్న ప్రపంచం. ఇక్కడ మనం చాలా విభిన్న విషయాల గురించి తెలుసుకోవచ్చు. మెసేజ్ లు, ఫొటోలు, వీడియోలు ఇలా రోజుకు ఎన్నో వేల సంఖ్యలో అప్ లోడ్ అవుతుంటాయి. ఇందులో ఉపయోగకరమైన సమాచారంతో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. కొన్ని వీడియోలు ఆశ్చర్యపరిచేవిగా ఉంటే మరికొన్ని భయం కలిగించే విధంగా ఉంటాయి. ఇవి మనం రోజూ ఎదుర్కొనే ఒత్తిడి నుంచి మనల్ని దూరం చేసేందుకు ఉపయోగపడతాయి. వీటిలో జంతువుల వీడియోలు కూడా ఉంటాయి. అవి చేసే వింత చేష్టలు నవ్వు తెప్పించడంతో పాటు ఔరా అనిపిస్తాయి.
సాధారణంగా కోతులు అడవుల్లో నివసిస్తాయి. అప్పుడప్పుడు జనావాసాల్లోకి వస్తుంటాయి. ఇంట్లో దూరిపోతూ అల్లరి చేస్తాయి. ఆహార పదార్థాలను తినేసి.. చిందరవందర చేస్తాయి. కొన్ని సార్లు దారిన వెళ్లేవారి నుంచి వస్తువులు లాక్కొని పారిపోతుంటాయి. కొన్ని సార్లు మనుషులనూ గాయపరుస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి చిప్స్ ప్యాకెట్ తింటుండటాన్ని మీరు గమనించవచ్చు. అదే సమయంలో అక్కడ మూడు నుంచి నాలుగు కోతులు ఉన్నాయి. అవి ఆహారం లాక్కునేందుకు ప్రయత్నిస్తాయి. ఆ వ్యక్తి ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా అతనిపై దూకి కిండ పడేస్తాయి. దీంతో ప్యాకెట్ లోని చిప్స్ కింద పడిపోతాయి.
View this post on Instagram
వైరల్ అవుతున్న ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ అయింది. వీడియోకు ఇప్పటి వరకు వేల సంఖ్యలో వ్యూస్, వందల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను ఫన్నీగా రాస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..