Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Odisha: కుక్క కరిచిన ఆరు నెలలకు యువకుడిలో వింత మార్పులు.. దగ్గరు వచ్చేందుకు జంకుతున్న జనం

అతని చర్యలు, కుక్కలా మొరగడం చూసిన కుటుంబ సభ్యులు మొదట షాక్ తిన్నారు.. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ రాజేష్ ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించడంతో కటక్‌లోని SCB మెడికల్ కళాశాలకు తరలించారు.

Odisha: కుక్క కరిచిన ఆరు నెలలకు యువకుడిలో వింత మార్పులు.. దగ్గరు వచ్చేందుకు జంకుతున్న జనం
Odisha man barking like a dog
Follow us
Surya Kala

|

Updated on: Nov 04, 2022 | 10:46 AM

పెద్దలు చెప్పిన మాటలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే.. ఒకొక్కసారి ప్రాణాలను కూడా రిస్క్ లో పడేసే స్టేజ్ కు చేరుకోవచ్చు. అందుకు ఉదాహరణ తాజా సంఘటన నిలుస్తుంది.. ఓ యువకుడిని ఆరు నెలల క్రితం కుక్క కరిచింది. అయితే అందుకు తగిన చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేశాడు. తత్ఫలితంగా ఆరునెలల తర్వాత కుక్కలా మొరగడం ప్రారంభించాడు. కుటుంబ సభ్యులు ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తుంది.. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన ఒడిశాలోని కటక్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

కటక్‌లోని అథాఘర్ పోలీసు పరిధిలోని ఉదయ్‌పూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు కుక్క కాటుకి గురైన ఆరు నెలల తర్వాత మంగళవారం కుక్కలా అరవడం ప్రారంభించాడు. నివేదికల ప్రకారం.. బాధిత వ్యక్తి రాజేష్ బ్యూరాగా గుర్తించారు. రాజేష్ ని కుక్క కరిచిన తర్వాత అందుకు తగిన చికిత్స పొందలేదు. ఆరునెలల తర్వాత మంగళవారం నవంబర్ 1న సడన్ గా కుక్కలా ‘అరవడం’ మొదలుపెట్టాడు. అతని చర్యలు, కుక్కలా మొరగడం చూసిన కుటుంబ సభ్యులు మొదట షాక్ తిన్నారు.. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ రాజేష్ ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించడంతో కటక్‌లోని SCB మెడికల్ కళాశాలకు తరలించారు.

ఈ విషయంపై వైద్య సిబ్బంది స్పందించారు..  కుక్క కాటు తర్వాత చికిత్స తీసుకోకపోతే.. బాధిత వ్యక్తికి హైడ్రోఫోబియా లేదా నీటి భయం ఏర్పడుతుందని చెప్పారు. అతడిలో రాబిస్ సోకిన లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. బాధిత వ్యక్తి నీటి శబ్దాన్ని కూడా సహించలేరని పేర్కొన్నారు. గొంతు నొప్పితో కుక్కలా అరవడం మొదలు పెడతారని ఆరోగ్య నిపుణుడు సామి సలీం అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..