AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka: ఆధార్ లేదని ఆస్పత్రిలో నో అడ్మిషన్.. మహిళ సహా కవల శిశువుల మృతి.. కన్నీరు పెట్టించే, కోపం తెప్పించే ఘటన

అయినవాళ్లకు అన్నీ అందుబాటులో..పేదలకు ఆమడ దూరంలో ఉంటాయనడానికి ఈ ఘటనే ఓ ఉదారహణ. తల్లి సహా ఇద్దరు శిశువుల ప్రాణాలకు బాధ్యులెవరు? ప్రాణానికి ఆధార్‌కి లింకేంటి? తుమకూరు ప్రభుత్వాసుత్రిలో అసలేం జరిగింది?

Karnataka: ఆధార్ లేదని ఆస్పత్రిలో నో అడ్మిషన్.. మహిళ సహా కవల శిశువుల మృతి.. కన్నీరు పెట్టించే, కోపం తెప్పించే ఘటన
Pregnant Twins In The Womb
Ram Naramaneni
|

Updated on: Nov 04, 2022 | 9:40 AM

Share

కర్నాటక తరుముకూరులో దారుణ ఘటన జరిగింది. కస్తూరి అనే మహిళ డెలివరీ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. కానీ ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకునేందుకు వైద్యులు,సిబ్బంది నిరాకరించారు. ఆధార్‌, ప్రసూతి కార్డులు లేవంటూ అభ్యంతరం చెప్పారు. బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని విధుల్లో ఉన్న డాక్టర్‌ సలహా కూడా ఇచ్చాడు. నొప్పులు ఎక్కువయ్యాయని ఆ అభాగ్యురాలు ఎంత మొత్తుకుంటున్నా ఎవరూ స్పందించ లేదు. కనీసం అయ్యో పాపం అనలేదు. ఆ నొప్పులతోనే ప్రాణాలను అరచేత్తో పట్టుకుని బుధవారం రాత్రి తన ఇంటికి చేరుకుంది. గురువారం ఉదయం ఇంట్లోనే ఓ శిశువును ప్రసవించింది. వెంటనే మరో శివువును ప్రసవించేలోపే చనిపోయింది. తల్లితో పాటు ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోవడం స్ధానికంగా విషాదాన్ని నింపింది.

తమిళనాడుకు చెందిన కస్తూరి గర్భవతి అయ్యాక భర్తతో విభేదాల కారణంగా అతనికి దూరంగా ఉంటుంది. కర్ణాటక వచ్చి తుమకూరు భారతీనగరలోని ఓ అద్దె ఇంట్లో ఉంటూ కూలి పనులు చేసుకుంటోంది. ఈ క్రమంలోనే నెలలు నిండి నొప్పులు రావడంతో చికిత్సకు డబ్బు లేకపోవడంతో ఇరుగు పొరుగు తలా కొంత సాయం చేశారు. ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు ఆస్పత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించడంతో రాత్రి మళ్లీ తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. కస్తూరి రాత్రంతా కాన్పు నొప్పుల బాధ అనుభవించింది. ప్రసవం సమయంలో తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు వదిలింది.

ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించి ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి డిమాండ్‌ చేశారు. అధికార పీఠాన్ని కాపాడుకునేందుకే బసవరాజ బొమ్మైకి కాలం సరిపోతోందని వరుస ట్వీట్లలో ఎటాక్‌ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామన్నారు మంత్రి సుధాకర్‌. విధుల్లో ఉన్న వైద్యుడు సహా ముగ్గురు సిబ్బందిని సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాల్సిన కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్లక్ష్యం నిలువెత్తున కనిపిస్తోంది. అన్నింటి ఆధార్‌తో లింక్‌ పెడితే…ఈ ప్రభుత్వాసుపత్రిలో ఏకంగా ప్రాణానికి ఆధార్‌ లింక్‌ పెట్టారు.. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. మనిషి ప్రాణాల కంటే ఆధారే ముఖ్యమా అంటూ ప్రశ్నిస్తున్నారు జనం.

మరిన్ని జాతీయ వార్తల కోసం