Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు-టవేరా ఢీః.. 11 మంది మృతి
రోడ్డు ప్రమాదాలతో ఎందరో అమాయకులు బలవుతున్నారు. దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందారు..
దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మధ్య ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో11 మంది దుర్మరణం చెందారు. రాష్ట్రంలోని జల్లార్ వద్ద బస్సు-టవేరా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరి కొందరు గాయపడగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, ఇలాంటి ప్రమాదాలు దేశంలో ఎన్నో జరుగుతున్నాయి. వాహనాలు నిర్లక్ష్యం నడిపించడం, ఓవర్‌టెక్, అతివేగం, మధ్యం సేవించి వాహనాలు నడపడం తదితర కారణాల వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి