భారతీయుడి కోసం ఆస్ట్రేలియా పోలీసుల గాలింపు.. ఆచూకీ చెబితే ఏకంగా 5.21 కోట్లు.. ఇంతకీ ఏం నేరం చేశాడంటే?
2018 అక్టోబర్‌లో తోయా కార్డింగ్లీ అనే యువతి దారుణంగా హత్యకు గురైంది. కైర్న్స్ నగరానికి 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న వాంగెట్టి బీచ్‌లో తన పెంపుడు జంతువుతో కలిసి వాకింగ్ చేస్తుండగా కొందరు వ్యక్తులు ఆమెను హత్య చేశారు.
అవును..నమ్మడానికి కాస్త టైమ్ పట్టిన ఇదే నిజం..ఓ భారతీయుడి కోసం ఆస్ట్రేలియా పోలీసులు జల్లెడ పడుతున్నారు. పోలీసుల విచారణలో ఆస్ట్రేలియా నుంచి ఇండియా పారిపోయాడని తెలిసింది. దీంతో అతడి ఆచూకీ కోసం పోలీసులు సోషల్ మీడియా వేదికగా భారీ రివార్డు ప్రకటించారు. ఆచూకీ చెప్పిన వాళ్లకు 1 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల రివార్డు ఇవ్వనున్నారు.ఈ నేపథ్యంలో అతడు ఎవరు? ఆస్ట్రేలియా పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు? అంత పెద్ద నేరం అతడు ఏం చేశాడు? అంటూ నెట్టింల్లో సెర్చింగ్ మొదలైంది. 2018 అక్టోబర్‌లో తోయా కార్డింగ్లీ అనే యువతి దారుణంగా హత్యకు గురైంది. కైర్న్స్ నగరానికి 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న వాంగెట్టి బీచ్‌లో తన పెంపుడు జంతువుతో కలిసి వాకింగ్ చేస్తుండగా కొందరు వ్యక్తులు ఆమెను హత్య చేశారు. భారత్‌కు చెందిన రాజ్‌విందర్ సింగ్ హాస్పిటల్‌లో మెయిల్ నర్సుగా పనిచేస్తున్నాడు. అయితే తోయా హత్య కేసుతో అతడికి సంబంధం ఉందని.. అంతేకాకుండా ఈ కేసులో అతడే కీలక వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. దీంతో అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించారు.
మహిళ హత్య కేసులో..
తోయా హత్య జరిగిన రెండు రోజుల తర్వాత రాజ్‌విందర్ ఆస్ట్రేలియాను వీడినట్టు పోలీసులు చెబుతున్నారు. అతడు తన భార్య, ముగ్గురు పిల్లలను ఆస్ట్రేలియాలోనే విడిచిపెట్టి భారత్‌కు వచ్చినట్టు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు. దీంతో అతడి ఆచూకి కోసం 1 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల రివార్డు ఇవ్వనున్నట్టు పోలీసులు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.అంటే మన ఇండియన్ కరెన్సీలో అది 5 కోట్ల 21 లక్షలకుపైగా ఉంటుంది. ఆసీస్ పోలీస్ హిస్టరీలో ఇంత భారీగా రివార్డ్ ఫస్ట్ టైమ్ ప్రకటించారు. దీంతో అతడి కోసం ఆస్ట్రేలియా పోలీసులే కాకుండా ప్రజలకు కూడా సెర్చ్ చేస్తున్నారనే అంశం హాట్ టాఫిక్ మారింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు కోట్లు.. ఓ భారతీయుడి ఆచూకీ ఆస్ట్రేలియా పోలీసులకు చెబితే లభించే రివార్డు ఇది. దీంతో సోషల్ మీడియాల్లో సెర్చింగ్ జోరు అందుకూ..అసలు అతడు ఎవరు? ఎమి చేశాడు, పోలీసులు ఎందుకు వెతుకుతున్నారంటూ నెట్టింట ప్రశ్నల వర్షం కురుస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..