Shocking Video: పులిని ముద్దు చేయాలనుకున్నాడు.. బోను లో చేయి పెట్టి.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు.. షాకింగ్ వీడియో
మొదట పులిని తన వైపుకు పిలవడానికి ప్రయత్నించాడు. అది దగ్గరకు వచ్చిన తర్వాత తన చేతితో పులి మెడను సవారు తీయడం మొదలు పెట్టాడు. అప్పుడు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పులి హఠాత్తుగా కోపంతో స్పందించింది.
పులిని ఇంట్లో పెంపుడు కుక్కపిల్లలా భావించినట్లు ఉన్నాడో ఒక వ్యక్తి.. ఏకంగా బోనులో చేయి పెట్టి దానిని ముద్దు చేస్తూ ఆటలు ఆడాలని భావించినట్లు ఉన్నాడు.. అమాయకత్వంతోనో.. లేదా అతి దైర్యంతోనో చేసిన పనితో ప్రాణాలు పోగొట్టుకున్న హృదయ విదారక ఘటన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోలో ఒక వ్యక్తి సంకోచం లేకుండా పులి బోనులో తన చేతిని ఉంచడం కనిపించింది. దీని తర్వాత నరమాంస భక్షక పులి ఏం చేసిందో చూస్తే ఎవరికైనా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. మీడియా నివేదికల ప్రకారం.. ఈ సంఘటన మెక్సికోలోని జూలో జరిగింది. పులి దాడిలో వ్యక్తి మృతి చెందాడు. ఈ వీడియో పాతది.. అయితే మళ్ళీ సోషల్ మీడియాలో వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో, పులి ఎన్‌క్లోజర్ దగ్గర ఒక వ్యక్తి నిలబడి ఉన్నట్లు మీరు చూడవచ్చు. అయితే అతను పులి బోనులో చేయి పెట్టి.. చేసే పని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మొదట పులిని తన వైపుకు పిలవడానికి ప్రయత్నించాడు. అది దగ్గరకు వచ్చిన తర్వాత తన చేతితో పులి మెడను సవారు తీయడం మొదలు పెట్టాడు. అప్పుడు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పులి హఠాత్తుగా కోపంతో స్పందించింది. బోనులోపల ఉన్న మనిషి చేతిని పట్టుకుని తినడం ప్రారంభించింది. పులి నోటికి తన చేయి చిక్కడంతో ఆ మనిషి నొప్పితో పెద్దగా అరవడం ప్రారంభించినా పులి అతడిని వదల లేదని వైరల్ క్లిప్‌లో చూడవచ్చు.
పులి దాడికి సంబంధించిన ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో savage.wilderness అనే ఖాతాతో భాగస్వామ్యం చేయబడింది. కొన్ని గంటల క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను 9 వేల మందికి పైగా లైక్ చేసినప్పటికీ, ఈ క్లిప్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. దాడి అనంతరం అక్కడ రక్తం ఏరులై పారినట్లు వీడియోలో చూడవచ్చు.
23 ఏళ్ల జోస్ డి జీసస్ జూ సిబ్బంది. జొస్ పులితో సరదాగా గడపాలని భావించాడు. పులికి తినిపిస్తూనే .. దానిని ముద్దు చేయడం కోసం బోను లోపలికి చేయి పెట్టాడు. ఇంతలో ఎవరూ ఊహించని ఆ భయంకరమైన దృశ్యం కూడా కెమెరాలో రికార్డయింది. పులి దాడిలో అధిక రక్తస్రావం అయింది. షాక్ తో జోస్‌కు గుండెపోటు వచ్చి మరణించాడు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..