AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bike Challan: ఈ యువకుడి యాక్టింగ్ కి ఆస్కార్ ఇవ్వాల్సిందే.. చలానా కట్టాలని చలిజ్వరం వచ్చినవాడిలా యాక్షన్.. వీడియో వైరల్

వైరల్ అవుతున్న వీడియోలో, నలుగురు పిల్లలు బైక్‌పై వెళుతున్నట్లు చూడవచ్చు. అయితే ఈ సమయంలో పోలీసులు వారిని పట్టుకున్నారు. ఆ గ్రూప్ లోని ఒక యువకుడు పోలీసుల ముందు.. డ్రామా మొదలు పెట్టాడు.

Bike Challan: ఈ యువకుడి యాక్టింగ్ కి ఆస్కార్ ఇవ్వాల్సిందే.. చలానా కట్టాలని చలిజ్వరం వచ్చినవాడిలా యాక్షన్.. వీడియో వైరల్
Challan Of The Bike
Surya Kala
|

Updated on: Nov 01, 2022 | 1:24 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఫన్నీ వీడియోలు, వింతలు , విశేషాలు, పెంపుడు జంవుతులు ఇలా రకరకాల వీడియోలు నెట్టింట్లో చూడొచ్చు. అంతేకాదు వివిధ రకాల సంఘటనలుకు సంబంధించిన వార్తలు కూడా చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయితే కొన్ని రకాల వార్తల్లో ఫన్నీ కంటెంట్ ఉంటే అది చదవడానికి ఆసక్తిని చూపిస్తారు. ఒకొక్కసారి పేజీని స్క్రోల్ చేస్తున్నప్పుడు అనేక క్లిప్‌లు కనిపిస్తూ ఉంటాయి. వాటిల్లో కొన్నింటిని ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టాడు. పదే పదే వాటిని చూస్తూ నవ్వు కుంటారు. నవ్వును అదుపు చేసుకోలేక పడిపడి నవ్వేవారున్నారు కూడా. అలాంటి ఒక వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా మీ నవ్వును నియంత్రించుకోలేరు.

ప్రస్తుతం బైక్ లేని ఇల్లు.. ఉండడం లేదు అంటే అతిశయోక్తికాదు. అంతేకాదు వీలుచిక్కితే చాలు తమకు అందుబాటులో ఉన్న వాహనంతో రోడ్డుమీద షికారుని చేయడానికి మక్కువ ఉన్న యువత సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉంటుంది. చిన్న పిల్లలు కూడా ఇప్పుడు తమ ఇంట్లోని పెద్దలను అనుసరిస్తూ.. తమకు అందుబాటులో ఉన్న బైక్ మీద ఫ్రెండ్స్ తో షికారు చేస్తూ.. రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి రకరకాల విన్యాసాల గురించి తరచుగా వార్తలు వింటూనే ఉన్నారు. అయితే అయితే ఇదే వ్యక్తులు పోలీసుల కంట బడి పట్టుబడితే అప్పుడు డ్రామా మొదలు పెడతారు. తాజాగా పిల్లలు పోలీసులకు చిక్కిన ఈ క్లిప్‌ ఒకటి వైరల్ అవుతుంది. పిల్లలు పోలీసుల ముందు ప్రారంభించిన డ్రామా చూసి మీ నవ్వు కంట్రోల్ చేసుకోలేరు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

View this post on Instagram

A post shared by Gidda company (@gieddee)

వైరల్ అవుతున్న వీడియోలో, నలుగురు పిల్లలు బైక్‌పై వెళుతున్నట్లు చూడవచ్చు. అయితే ఈ సమయంలో పోలీసులు వారిని పట్టుకున్నారు. ఆ గ్రూప్ లోని ఒక యువకుడు పోలీసుల ముందు.. డ్రామా మొదలు పెట్టాడు. పోలీసులను చూడగానే మూర్ఛ వచ్చినట్లుంది.. చలి జ్వరం వచ్చిన వాడిలా వణకడం మొదలు పెట్టాడు. దీంతో పోలీసులు ఆ యువకుడి నీరు ఇచ్చారు.. అప్పడు ఆ వాటర్ బాటిల్ ను కూడా పట్టుకునే శక్తి లేదు అన్నట్లుగా విడిచిపెట్టాడు.  ఆ బాలుడిని చూసిన వారికి ఎవరికైనా తెలుస్తుంది.. అది పోలీసులను చూసి నటిస్తున్నాడని.

ఈ వీడియోను గిడ్డీ అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వేల మంది చూశారు. వీడియోపై పలువురు వ్యాఖ్యానిస్తూ, ‘ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. చలానా నుంచి తప్పించుకోవడం కోసం అంటే.. ‘బాబూ మీరు ఎంత నటించినా, కానీ చలాన్ కట్టాల్సిందే అని మరొకరు కామెంట్ చేశారు.  రూ. 150  ఫైన కట్టడం తప్పించుకోవడం కోసం ఇలా లేని భయాన్ని నటించడం కంటే.. పోలీసులకు క్షమాపణ చెప్పడం మంచిది తమ అభిప్రాయాన్ని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..