Elephant: నువ్వు కూడా ఈ మాయలో పడ్డావా? స్మార్ట్‌ఫోన్ చూసేందుకు గజరాజు తంటాలు.. వీడియో చేస్తే నవ్వాగదంతే
కోతులు, చింపాంజీలు, కుక్కలు తదితర మూగజీవాలు స్మార్ట్‌ఫోన్‌ని చూస్తూ కాలక్షేపం చేస్తోన్న వీడియోలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇక ఇప్పుడు ఒక ఏనుగు కూడా మొబైల్‌కు బానిసగా మారిపోయింది.
ఇప్పుడు అందరి జీవితాల్లో స్మార్ట్‌ఫోన్ ఒక భాగమైపోయింది. అరచేతిలో ఇమిడే మొబైల్‌లోనే అన్ని రకాల సదుపాయాలు ఉండడంతో పక్కకు తిరిగా చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇటీవల కాలంలో మనుషులతో పాటు జంతువులు కూడా మొబైల్‌కి బానిసలుగా మారిపోతున్నాయి. వీటికి నిదర్శనంగా ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. కోతులు, చింపాంజీలు, కుక్కలు తదితర మూగజీవాలు స్మార్ట్‌ఫోన్‌ని చూస్తూ కాలక్షేపం చేస్తోన్న వీడియోలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇక ఇప్పుడు ఒక ఏనుగు కూడా మొబైల్‌కు బానిసగా మారిపోయింది. ఒక వ్యక్తి స్మార్ట్ ఫోన్ ను చూస్తూ ఉంటే పక్కనే ఉన్న ఏనుగు దానిని చూసేందుకు పడుతున్న తంటాలు నెటిజన్లకు నవ్వు తెప్పిస్తున్నాయి. కేరళలోని కుంభకోణం శ్రీ కుంభేశ్వర స్వామి ఆలయంలో ఈ ఘటన జరగ్గా దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో దేవస్థానం ప్రాంగణంలో ఏనుగు సంరక్షణ బాధ్యతలు, బాగోగులు చూసుకునే ఓ మావటి ఒక చోట కూర్చొని తన మొబైల్ చూస్తుంటాడు. ఓ ఏనుగు మావటి ఫోన్ చూస్తుండటాన్ని గమనించి అక్కడికి వస్తుంది. అది కూడా ఫోన్ చూసేందుకు చాలా ప్రయత్నిస్తుంది. అయితే, ఏనుగు చాలా పెద్దది కావడంతో మొబైల్ కనిపించదు. అయినా అది వెనక్కు తగ్గదు. వంగి వంగి మొబైల్‌ను చూసేందుకు ప్రయత్నిస్తుంది. అయినా ఫలితం ఉండదు. చివరకు చేసేదేమి లేక తొండం సాయంతో కాస్త కిందకు వంగి చూసేందుకు ప్రయత్నిస్తుంది.
కేరళ ఎలిఫెంట్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ‘ఏనుగు, మావటి మధ్య ఉన్న బంధం అద్వితీయమైనది. ఇందుకు ఈ వీడియోనే నిదర్శనం’ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఇందులో ఏనుగు ఫోన్ చూడటానికి పడుతున్న కష్టం చూసి అందరూ నవ్వుకుంటున్నారు. పాపం ఆ గజరాజుకు ఎంత కష్టం వచ్చిందో, నువ్వు కూడా మొబైల్ మాయలో పడిపోయావా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..