Facebook India: ఫేస్‌బుక్‌కు భారీ షాక్.. మెటా ఇండియా హెడ్ అజిత్ మోహన్ రాజీనామా!
ఫేస్‌బుక్ పేరెంట్ మెటా ఇండియా హెడ్ అజిత్ మోహన్ గురువారం (అక్టోబర్ 3) రాజీనామా చేశారు. కంపెనీ నుంచి తప్పుకుంటున్నట్లు మెటా ప్లాట్‌ఫారమ్ ధృవీకరించింది..
ఫేస్‌బుక్ పేరెంట్ మెటా ఇండియా హెడ్ అజిత్ మోహన్ గురువారం (అక్టోబర్ 3) రాజీనామా చేశారు. కంపెనీ నుంచి తప్పుకుంటున్నట్లు మెటా ప్లాట్‌ఫారమ్ ధృవీకరించింది. అజిత్ మోహన్‌కు మెరుగైన జాబ్ ఆపర్‌చ్యూనిటీ రావడం వల్ల ప్రస్తుతం చేస్తున్న జాబ్‌ను వదిలిపెడుతున్నట్లు తెల్పింది. నివేదికల ప్రకారం.. ఫేస్‌బుక్ ప్రత్యర్థ కంపెనీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన స్నాప్‌లో చేరబోతున్నట్లు తెలుస్తోంది.
మోహన్ రాజీనామాపై మెటా కంపెనీ స్పందించింది. మెటా కంపెనీ నుంచి మోహన్ వైదొలిగారని, కంపెనీ వెలుపల ఆయనకు మరో అవకాశం రావడంతో మోహన్ కంపెనీ నుంచి తప్పుకున్నట్లు మెటా గ్లోబల్ బిజినెస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ నికోలా మెండెల్సన్ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా అజిత్ మోహన్ 2019 జనవరిలో ఫేస్‌బుక్ ఇండియాలో మేనేజింగ్ డైరెక్టర్‌గా నియామకమయ్యారు. మెటా భారత వ్యాపారాలకు మోహన్ వైస్ ప్రెసిడెంట్‌గా, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. అజిత్ ఆధ్వర్యంలో ఫేస్‌బుక్ ఫ్యామిలీ యాప్స్ అయిన వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌లకు ఇండియా నుంచి దాదాపు 20 కోట్లకు యూజర్లు పెరిగారు. మెటా కంటె ముందు స్టార్ ఇండియా వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ హాట్‌స్టార్‌లో నాలుగేళ్ల పాటు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు.
ఇతర బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.