- Telugu News Photo Gallery Winters causing a lot of dandruff? use apple cider vinegar to get rid of dandruff
Dandruff: చలికాలంలో చుండ్రు సమస్య వేధిస్తోందా? ఆపిల్ సైడర్ వెనిగర్‌తో వారానికి 2 సార్లు ఇలా చేశారంటే..
శీతాకాలం దాదాపు మొదలైనట్లే. ఈ సీజన్‌లో సాధారణంగా ప్రతిఒక్కరినీ చుండ్రు సమస్య వేధిస్తుంది. చుండ్రును తేలికగా వదిలించుకోవాలంటే ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించవచ్చు. చుండ్రుతోపాటు అనేక జుట్టు సమస్యలకు కూడా ఇది మేలు చేస్తుంది..
Updated on: Nov 03, 2022 | 6:12 PM

శీతాకాలం దాదాపు మొదలైనట్లే. ఈ సీజన్‌లో సాధారణంగా ప్రతిఒక్కరినీ చుండ్రు సమస్య వేధిస్తుంది. చుండ్రును తేలికగా వదిలించుకోవాలంటే ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించవచ్చు. చుండ్రుతోపాటు అనేక జుట్టు సమస్యలకు కూడా ఇది మేలు చేస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ ఎలా ఉపయోగించాలంటే..

ఒక కప్పు నీటిలో కొన్ని చుక్కలు ఆపిల్ సైడర్ వెనిగర్ కలుపుకోవాలి. జుట్టుకు షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ నీటితో తలకు మసాజ్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత సాధారణ నీళ్లతో జుట్టు శుభ్రం చేసుకుంటే సరి.

ఆపిల్ సైడర్ వెనిగర్, వెల్లుల్లి ప్యాక్. ముందుగా వెల్లుల్లిని మెత్తగా గ్రైడ్ చేసుకుని రసాన్ని వేరు చెయ్యాలి. తర్వాత వెల్లుల్లి రసంలో 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ కలుపుకోవాలి. దీన్ని తలకు పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత షాంపుతో తల స్నానం చెయ్యాలి. ఈ విధంగా వారానికి 1 నుంచి 2 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

యాపిల్ సైడర్ వెనిగర్-పెరుగు ప్యాక్. అరకప్పు పెరుగులో 1 టీస్పూన్ యాపిల్ సైడర్ బాగా కలుపుకుని ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, మసాజ్ చేసుకోవాలి. 30 నుంచి 40 నిమిషాల తర్వాత షాంపుతో తల స్నానం చేసుకోవాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్-ఆముదం (కస్టర్ ఆయిల్). కప్పు నీళ్లలో కొన్ని ఆపిల్ సైడర్ వెనిగర్ చుక్కలు కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి 2-3 టీ స్పూన్ల ఆముదం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి తలకు పట్టించి, మసాజ్ చేయాలి. కొద్దిసేపటి తర్వాత తల స్నానం చేసుకోవాలి.





























