AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: మాజీ అందాల రాణుల రహస్య వివాహం.. షాక్‌లో అభిమానులు!

అందాల పోటీలో మొదటిసారి కలుసుకున్న ఈ ముద్దు గుమ్మలు అనుకోకుండా ప్రేమలో పడ్డారు. వాళ్ల వాళ్ల బాయ్‌ ఫ్రెండ్స్‌తో కాదు.. అందగత్తెలిద్దరూ ఒకరిపై ఒకరు మనసుపడ్డారు. అంతేకాదు రహస్యంగా వివాహం కూడా..

Watch Video: మాజీ అందాల రాణుల రహస్య వివాహం.. షాక్‌లో అభిమానులు!
Miss Puerto Rico And Miss Argentina
Srilakshmi C
|

Updated on: Nov 05, 2022 | 8:41 AM

Share

అందాల పోటీలో మొదటిసారి కలుసుకున్న ఈ ముద్దు గుమ్మలు అనుకోకుండా ప్రేమలో పడ్డారు. వాళ్ల వాళ్ల బాయ్‌ ఫ్రెండ్స్‌తో కాదు.. అందగత్తెలిద్దరూ ఒకరిపై ఒకరు మనసుపడ్డారు. అంతేకాదు రహస్యంగా వివాహం కూడా చేసుకున్నారు. అంతే.. అభిమానుల గుండె నీరైపోయింది. ఇంతకీ వాళ్లెవరంటే..

మిస్ అర్జెంటీనా మరియానా వరెలా, మిస్ ప్యూర్టో రికో ఫాబియోలా వాలెంటైన్ వీరిద్దరి ప్రేమ కహానీ ప్రస్తుతం యావత్‌ ప్రపంచమంతటా చర్చసాగుతోంది. మిస్ ఇంటర్నేషనల్ పేజెంట్-2020లో తొలి పది స్థానాల్లో నిలిచిన వారిలో వీరిద్దరు కూడా ఉన్నారు. మిస్‌ అర్జెంటీనాగా మరియానా వరెలా, మిస్ ప్యూర్టో రికోగా ఫాబియోలా వాలెంటైన్ విజేతలుగా ఎంపికయ్యారు. ఇక ఈ పోటీల్లోనే వీరి ప్రేమకు బీజం పడింది. రెండు వేరు వేరు దేశాలకు చెందిన ఈ అందాల రాణులు గత రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని వీరిద్దరూ ఎప్పుడూ వెల్లడించలేదు. అభిమానులంతా వీరు మంచి స్నేహితులని ఇంతకాలం అనుకున్నారు. ఐతే మరియానా వరెలా, ఫాబియోలా వాలెంటైన్ తమ రహస్య వివాహం గురించి సోహల్‌ మీడియా వేదికగా వెల్లడించడంతో సర్వత్రా ఆశ్చర్యానికి గురయ్యారు.

ఇవి కూడా చదవండి

అక్టోబర్‌ 28న తమకు ప్రత్యేకమైన రోజని, తమ రిలేషన్‌షిప్‌ను వెల్లడిస్తున్నట్లు తెల్పుతూ ఇన్‌స్టా్గ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరి భామల వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో పోస్టు చేసిన గంటల వ్యవధిలోనే 1 లక్షకు పైగా లైక్‌లు, 2 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. ఇక నెటిజన్‌లు, అభిమానులు కామెంట్స్ సెక్షన్‌లో ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. అన్నట్టు వీరి వివాహం ప్యూర్టెరికోలో జరిగింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.