Varisu: దళపతి విజయ్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది.. ఆకట్టుకుంటున్న సాంగ్ ప్రోమో
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వారసుడు అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ కానుంది.
వరుస విజయాలతో దూసుకుపోతోన్న దళపతి విజయ్ ఇప్పుడు స్ట్రయిట్ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వారసుడు అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ కానుంది. తమిళ్ ఈ సినిమాలో నేషనల్ క్రాష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతి కానుకగా విజయ్ వారసుడు సినిమాను రంగంలోకి దింపనున్నారు. దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను వంశీ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సినిమా పై అంచనాలను పెంచేశాయి. రీసెంట్ గా విడుదల చేసిన వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తాజాగా ఈ సినిమానుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్ ప్రోమో తమిళ్ వర్షన్ కు సంబంధించింది. రంజితమే అంటూ సాగే ఈ పాటలో దళపతి అదిరిపోయే డాన్స్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. ప్రోమోలో చిన్న మూమెంట్ ను చూపించారు. ఇక ఫుల్ సాంగ్ ను నవంబర్ 5న విడుదల చేయనున్నారు. తమన్ మరోసారి తన మ్యూజిక్ తో అలరించనున్నారని ఈ ప్రోమో చూస్తే అర్ధమవుతోంది.