Hansika : పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పనున్న హాన్సిక ?.. ఆసక్తికర కామెంట్స్ చేసిన హీరోయిన్..
బుధవారం తనకు కాబోయే భర్తను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది హన్సిక. తన ప్రియుడు సోహెల్ ఈఫిల్ టవర్ ముందు తనకు ప్రపోజ్ చేస్తున్న ఫోటోస్ షేర్ చేస్తూ క్లారిటీ ఇచ్చేసింది. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సోహెల్ ను ఆమె వివాహం చేసుకోబోతుంది.
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ హన్సిక మోత్వాని. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. అయితే అందం, అభినయం ఎంత ఉన్నా కొంతకాలంగా ఈ ముద్దుగుమ్మకు అంతగా అవకాశాలు రావడం లేదు. దీంతో ఈ అమ్మడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. వచ్చే నెలలో తాను వివాహం చేసుకోబోతున్నట్లుగా స్వయంగా వెల్లడించిన హన్సిక.. బుధవారం తనకు కాబోయే భర్తను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది. తన ప్రియుడు సోహెల్ ఈఫిల్ టవర్ ముందు తనకు ప్రపోజ్ చేస్తున్న ఫోటోస్ షేర్ చేస్తూ క్లారిటీ ఇచ్చేసింది. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సోహెల్ ను ఆమె వివాహం చేసుకోబోతుంది. వీరిద్దరు చాలా కాలంగా స్నేహితులు. అంతేకాదు.. బిజినెస్ పార్టనర్ కూడా. వీరిద్దరు కలిసి పలు ఈవెంట్స్ ఆర్గనైజ్ చేశారట.
అదే సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించిందని.. కొంతకాలం డేటింగ్లో ఉన్న వీరు ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యారు. డిసెంబర్ 4న వీరి పెళ్లి రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలోగల ప్రాచీన ప్యాలెస్‍లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. పెళ్లి తర్వాత హన్సిక నటనకు గుడ్ బై చెబుతుందా ? లేదా కంటిన్యూ అవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న హన్సిక తాను వివాహం తర్వాత నటనకు గుడ్ బై చెప్పడం లేదని.. అవకాశాలు వస్తే నటించేందుకు సిద్ధమని తెలిపింది.
ప్రతి పని చాలా విలువైనది అని.. వివాహం తర్వాత పని చేయకూడదు అనే విషయాన్ని తాను పట్టించుకోనని తెలిపింది. పెళ్లయ్యాక పని మానేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. హన్సిక చివరిసారిగా డైరెక్టర్ యూఆర్ జమీల్ తెరకెక్కించిన మహా లో కనిపించింది. అలాగే పార్ట్ నర్, రౌడీ బేబీ, మై నేమ్ ఈజ్ శ్రుతి, గార్డియన్ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.