Anudeep Kv: అరుదైన వ్యాధితో బాధపడుతోన్న జాతిరత్నాలు డైరెక్టర్.. అందుకే ఆయన అలా ఉంటారట.!

అనుదీప్ పిట్టగోడ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత జాతిరత్నాలు అనే సినిమా  చేశాడు.

Anudeep Kv: అరుదైన వ్యాధితో బాధపడుతోన్న జాతిరత్నాలు డైరెక్టర్.. అందుకే ఆయన అలా ఉంటారట.!
Anudeep Kv
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 03, 2022 | 6:23 PM

డైరెక్టర్ కేవీ అనుదీప్.. ఈ మధ్య కాలంలో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. పలు షార్ట్ ఫిలిమ్స్ కు దర్శకత్వం వహించిన అనుదీప్ ఇప్పుడు దర్శకుడిగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అనుదీప్ పిట్టగోడ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత జాతిరత్నాలు అనే సినిమా  చేశాడు. నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సూపర్ హిట్ అవ్వడంతో అనుదీప్ క్రేజ్ పెరిగింది. ఆ సినిమా తర్వాత తమిళ్ హీరో శివ కార్తికేయన్ హీరో ప్రిన్స్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనుదీప్ మాట్లాడుతూ.. తనకు ఓ అరుదైన వ్యాధి ఉందని షాకింగ్ విషయం చెప్పాడు.

అనుదీప్ చేసే సినిమాలు కామెడీ ఎంటర్టైనర్లే అయినప్పటికీ అనుదీప్ మాత్రం చాలా సీరియస్ గా ఉంటాడు. ఎప్పుడు సీరియస్ లుక్ లోనే కనిపిస్తూ ఉంటాడు. అయితే దానికి కారణం లేకపోలేదు. తనకు ఓ వ్యాధి ఉందని దాని వల్లే తాను   సీరియస్ గా కనిపిస్తానని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

హైలీ సెన్సీటీవ్‌ పర్సన్‌ (హెచ్‌ఎస్‌పీ) అనే వ్యాధితో తాను బాధపడుతున్నట్టు తెలిపాడు అనుదీప్. ఈ వ్యాధి లక్షణాలు చాలా మందిలో కనిపిస్తూ ఉంటాయి కానీ వాటిని ఎక్కువగా పట్టించుకోరు. నాకు గ్లూటెన్‌ పడడు. ఒకవేళ నేను కాఫీ తాగితే రెండు రోజుల పాటు నిద్ర పట్టదు. ఏదైనా జ్యూస్ తాగితే నా మైండ్‌ కామ్‌ అవుతుంది అని తెలిపారు. ఇక ఈ వ్యాధి ఉన్నవారి సెన్సెస్‌ చాలా స్ట్రాంగ్‌గా పని చేస్తాయని.. ఎక్కువ లైటింగ్ చూసినా.. ఘాటైన వాసనలు పీల్చిన నేను తట్టుకోలేను. అలాగే ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళు త్వరగా అలిసిపోతారు. దానికి తగ్గట్టుగా ఆహారం తీసుకుంటూ ఉంటాను అని తెలిపారు. అలాగే ఈ వ్యాధి పై త్వరలో ఓ సినిమాకూడా చేయాలనీ అనుకుంటున్నా అని తెలిపారు అనుదీప్.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!