Anchor Shyamala: స్టేజ్ పైనే యాంకర్‏ను ఆంటీ అనేసిన నటుడు.. శ్యామల కౌంటర్ మాములుగా లేదు..

యాంకర్ శ్యామలను సీనియర్ నటుడు రాజా రవీంద్ర ఆంటీ అంటూ కామెడీగా ఆట పట్టించే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె ఇచ్చిన కౌంటర్‏కు షాకయ్యాడు.

Anchor Shyamala: స్టేజ్ పైనే యాంకర్‏ను ఆంటీ అనేసిన నటుడు.. శ్యామల కౌంటర్ మాములుగా లేదు..
Raja Ravindra, Shyamala
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 03, 2022 | 1:12 PM

యంగ్ హీరో నవీన్ చంద్ర కథానాయకుడిగా ‘దండు పాళ్యం’ ఫేమ్ శ్రీనివాస్ రాజు రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘తగ్గేదే లే’. భ్రద ప్రొడక్షన్స్ బ్యానర్‌ నిర్మిస్తోన్న ఈ సినిమా నవంబర్ 4న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకలో యాంకర్ శ్యామలను సీనియర్ నటుడు రాజా రవీంద్ర ఆంటీ అంటూ కామెడీగా ఆట పట్టించే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె ఇచ్చిన కౌంటర్‏కు షాకయ్యాడు. తగ్గేదే లే చిత్రానికి రాజా రవీంద్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అంతేకాకుండా ఈ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో రాజా రవీంద్ర తన స్పీచ్ ముగిస్తూ శ్యామల ఆంటీకి థ్యాంక్స్ అనేశాడు. ఇక అక్కడే ఉన్న శ్యామల ఆయన మాటలను చాలా స్పోర్టివ్‏గా తీసుకుంటూ రాజా రవీంద్రకు తన స్టైల్లో కౌంటరిచ్చింది.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజా రవీంద్ర మాట్లాడుతూ.. ‘ప్రేమ్, అఖిల్, సుబ్బారెడ్డి గారు మంచి చిత్రాలు తీద్దామని ఇండస్ట్రీకి వచ్చారు. బాహుబలి వంటి పది సినిమాలను తీయగల సత్తా ఉంది. కానీ మంచి కంటెంట్ చిత్రాలను తీయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. కరోనాలో కష్టపడి పని చేశాం. అందరికీ వ్యాక్సినేషన్ చేయించి సొంత మనుషుల్లా చూసుకున్నారు. చాలా హ్యాపీగా పని చేశాం. ఇలాంటి సినిమాలు ఆడితే.. ఈ బ్యానర్ ద్వారా అందరికీ పని దొరుకుతుంది’ అని మాట్లాడుతూ.. చివర్లో శ్యామల ఆంటీకి థ్యాంక్స్ అంటూ ముగించారు.

ఇవి కూడా చదవండి

దీంతో తనను ఆంటీ అనడంపై సీరియస్ కాకుండా తెలివిగా సెటైర్ వేసింది శ్యామల. అబ్బా..హా.. అర్రె.. నేనే ఆంటీ అంటే మీరు తాతయ్య అయిపోయినట్టే చక్కగా అంటూ కౌంటరిచ్చింది. దీంతో శ్యామల సమాధానంకు రాజా రవీంద్ర షాకయ్యారు.

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..