APPSC Group-1: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పలు శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌ -1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ బుధవారం (అక్టోబర్‌ 2) ప్రకటన విడుదల..

APPSC Group-1: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే..
APPSC Group -1 Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 03, 2022 | 2:51 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పలు శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌ -1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ బుధవారం (అక్టోబర్‌ 2) ప్రకటన విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్‌ ప్రకారం ఆన్‌లైన్‌ దరఖాస్తులు నవంబర్‌ 2వ తేదీతో ముగిసింది. ఐతే అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువు నవంబర్‌ 5వ తేదీ వరకు పెంచినట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది. మొత్తం 92 గ్రూప్‌ 1 పోస్టులకుగానూ ఇప్పటివరకు 1,12,000ల మంది దరఖాస్తు చేసుకున్నారు. మరో 3 రోజులపాటు దరఖాస్తు గడువు పొడిగించడంతో లక్ష 50 వేల వరకు అప్లికేషన్లు చేరే అవకాశం ఉందని అంచనా.

కాగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఎవరైనా ముగింపు సమయంలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే జనరల్‌ అభ్యర్ధులు రూ.370లు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/పీహెచ్‌/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులు రూ.120లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాతపరీక్ష (ప్రిలిమ్స్, మెయిన్స్‌), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ రాత పరీక్ష డిసెంబర్‌ 18, 2022న నిర్వహిస్తారు. మార్చి 2023లో మెయిన్స్‌ రాత పరీక్ష ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు: 1
  • అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు: 1
  • డిప్యూటీ కలెక్టర్ పోస్టులు: 10
  • అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు: 12
  • డిప్యూటీ సూపరింటెండెంట్‌ పోస్టులు: 13
  • డివిజనల్/డిస్ట్రిక్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టులు: 2
  • అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్‌ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు: 8
  • రీజనల్‌ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్‌ పోస్టులు: 2
  • మండల పరిషత్ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టులు: 7
  • జిల్లా రిజిస్ట్రార్ పోస్టులు: 3
  • జిల్లా గిరిజన సంక్షేమ ఆఫీసర్‌ పోస్టులు: 1
  • జిల్లా బీసీ సంక్షేమ ఆఫీసర్‌ పోస్టులు: 2
  • మున్సిపల్ కమీషనర్ గ్రేడ్-2 పోస్టులు: 6
  • అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/లే సెక్రెటరీ అండ్‌ ట్రెజర్‌ గ్రేడ్-II పోస్టులు: 18
  • అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు: 4

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.