TSLPRB Part II: ప్రిలిమ్స్ రిజల్ట్స్ రీ-చెక్ అభ్యర్ధనలపై పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వివరణ ఇదే..’ఆ మార్కులను కలపలేదు’
తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్ధులకు పార్ట్-2 దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 27 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఐతే ప్రిలిమ్స్‌లో అర్హత సాధించని వారిలో కొంత మంది అభ్యర్ధులు ప్రిలిమ్స్ రిజల్ట్స్ రీ-చెక్ చేయవల్సిందిగా రిక్రూట్‌మెంట్ బోర్డును సంప్రదించారు. దీనిపై టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ..
తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్ధులకు పార్ట్-2 దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 27 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. దాదాపు 40 వేల మంది అభ్యర్ధులు ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించారు. వీరిలో పురుష అభ్యర్ధులు రూ.31,000ల మంది ఉండగా, మహిళలు 9 వేల మంది ఉన్నారు. పార్ట్-II ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 10వ తేదీ రాత్రి 10 గంటలకు ముగుస్తుంది. పార్ట్-IIకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులను మాత్రమే ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్/ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తామని బోర్డు స్పష్టం చేసింది.
ఐతే ప్రిలిమ్స్‌లో అర్హత సాధించని వారిలో కొంత మంది అభ్యర్ధులు ప్రిలిమ్స్ రిజల్ట్స్ రీ-చెక్ చేయవల్సిందిగా రిక్రూట్‌మెంట్ బోర్డును సంప్రదించారు. దీనిపై తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఈ విధంగా క్లారిటీ ఇచ్చింది.. ‘ఓఎమ్‌ఆర్ షీట్లను రెండు రకాలైన ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్ స్కాన్‌లతో పాటు, ఓఎమ్‌ఆర్ షీట్లపై అనుమానాస్పదంగా అనిపించిన బబుల్‌లను ఎక్స్‌పర్ట్స్ వ్యక్తిగతంగా పరిశీలిస్తారు. అభ్యర్ధుల నుంచి వచ్చిన అభ్యర్ధనలమేరకు 400పైగా ఓఎమ్‌ఆర్ షీట్లను మళ్లీ చెక్ చేశాం. ఒక్క ఎర్రర్ కూడా కనిపించలేదు. అందువల్ల బోర్డు ప్రకటించిన ఫలితాల్లో ఎటువంటి అవకతవకలు లేవని, ఫలితాలన్ని వాస్తవమైనవనే విషయాన్ని అభ్యర్ధులు గమనించాలి. అలాగే.. ఆగస్టు 22, 2022వ తేదీన నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రంలో ప్రశ్నలు తప్పుగా వచ్చాయని, అందువల్ల దాదాపు 22 మార్కులను బోర్డు కలిపినట్లు సోషల్ మీడియాలో ఓ ఫేక్ వార్త హల్‌చల్ చేస్తోంది. దీనిలో ఎంతమాత్రం వాస్తవం లేదు. క్వశ్చన్ పేపర్‌లోని ప్రతి విభాగం నుంచి ఇచ్చిన ప్రశ్నలను ఆయా సబ్జెక్టుల్లో సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ తయారు చేశారు. అలాగే వీరు రూపొందించిన సమాధాన పత్రం అక్టోబర్ 21వ తేదీన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని’ బోర్డు వివరించింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.