UGC NET Result 2022 date: యూజీసీ నెట్ జూన్-2022 ఫైనల్ ఆన్సర్‌ ‘కీ’ విడుదల.. రిజల్ట్స్‌ ఎప్పుడంటే..

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నెట్ జూన్-2022 ఆఫీషియల్‌ ఆన్సర్‌ 'కీ' నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం (నవంబర్‌ 2) విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ లో నుంచి..

UGC NET Result 2022 date: యూజీసీ నెట్ జూన్-2022 ఫైనల్ ఆన్సర్‌ 'కీ' విడుదల.. రిజల్ట్స్‌ ఎప్పుడంటే..
UGC NET 2022 final answer key released
Follow us

|

Updated on: Nov 02, 2022 | 6:57 PM

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నెట్ జూన్-2022 ఆఫీషియల్‌ ఆన్సర్‌ ‘కీ’ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం (నవంబర్‌ 2) విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ లో నుంచి ఆన్సర్‌ ‘కీ’ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జులై నుంచి అక్టోబర్‌ వరకు 3 ఫేజ్‌లలో నిర్వహించిన యూజీసీ నెట్‌ డిసెంబర్‌ 2021, జూన్‌ 2022 పరీక్షలను దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. అన్ని సబ్జెక్టుల్లో, అన్ని షిఫ్టులకు సంబంధించిన ఆన్సర్‌ కీలను ఎన్టీఏ తాజాగా విడుదలైంది. ఫైనల్ రిజల్ట్స్‌ మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్ధులకు సంబంధించిన అప్లికేషన్ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి స్కోర్ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా దేశంలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల్లో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్(జేఆర్‌ఎఫ్), లెక్చరర్‌షిప్/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హత కోసం యూజీసీ నెట్ పరీక్షను ప్రతి యేట ఎన్టీఏ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

యూజీసీ నెట్‌ జూన్-2022 ఆన్సర్ ‘కీ’ ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే..

  • ముందుగా యూజీసీ నెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ ను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్‌ పేజ్‌లో కనిపించే యూజీసీ నెట్‌ ఫైనల్‌ ఆన్సర్‌ కీ 2022 లింక్‌పై క్లిక్‌ చెయ్యాలి.
  • లాగిన్‌ వివరాలను నమోదు చేసి సబ్‌మిట్‌పై క్లిక్‌ చెయ్యాలి.
  • తర్వాత యూజీసీ నెట్‌ ఆన్సర్‌ ‘కీ’ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • హార్డు కాపీని డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రింట్‌ఔట్ తీసుకోవాలి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.