NHM Recruitment: నేషనల్ హెల్త్ మిషన్‌లో భారీగా మెడికల్ పోస్టులు.. ఎలా ఎంపిక చేస్తారంటే..
నేషన్ హెల్త్ మిషన్ నాసిక్‌లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాల్లో ఉన్న పీడియాట్రిసియన్స్ గైనకాలజిస్ట్, స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
నేషన్ హెల్త్ మిషన్ నాసిక్‌లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాల్లో ఉన్న పీడియాట్రిసియన్స్ గైనకాలజిస్ట్, స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 220 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో స్పెషలిస్ట్ (25), మెడికల్ ఆఫీసర్ (82), స్టాఫ్ నర్స్ ఫిమేల్ (81), కౌన్సిలర్ .. ఆర్‌కెఎస్‌కె (20), ఎస్‌టిఎస్ (ఎన్‌టిఈపీ) (1), ఇమ్యూనైజేషన్ ఫీల్డ్ మానిటర్ (2), ఇఎంఎస్ కోఆర్డినేటర్స్ (1), ల్యాబ్ టెక్నీషియన్ (4), సిటి స్కాన్ టెక్నీషియన్ (1), ఆడియోమెట్రిక్ అసిస్టెంట్ (1), ఫెసిలిటీ మేనేజ్ (1), డెంటల్ అసిస్టెంట్ (1) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను అనుసరించి.. పీజీ డిగ్రీ/డిప్లొమా, ఎంబీబీఎస్, బీఏఎమ్‌ఎస్, జీఎన్‌ఎమ్, ఎమ్‌ఎస్‌డబ్ల్యూ, ఏదైనా డిగ్రీ, 12వ తరగతి, డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థలు వయసు 18 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంబీబీఎస్ స్పెషలిస్ట్‌లకు 70 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను విద్యార్హత, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 15, 2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..