AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AIESL Recruitment 2022: నెలకు రూ.లక్షన్నర జీతంతో ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూఢిల్లీలోని ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌.. 27 ఎగ్జిక్యూటివ్‌ (ఫైనాన్స్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

AIESL Recruitment 2022: నెలకు రూ.లక్షన్నర జీతంతో ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ..
AIESL New Delhi Recruitment 2022
Srilakshmi C
|

Updated on: Nov 02, 2022 | 5:08 PM

Share

భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూఢిల్లీలోని ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌.. 27 ఎగ్జిక్యూటివ్‌ (ఫైనాన్స్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టుకలు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంకామ్‌/ఎంబీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఎవరైనా కింది అడ్రస్‌లలో నవంబర్‌ 14, 21, 28 తేదీల్లో ఉదయం 9 గంటల 30 నిముషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే ఇంటర్వ్యూలకు నేరుగా హాజరుకావచ్చు. ఐతే ఇంటర్వ్యూ సమయంలో ప్రతిఒక్కరూ రూ.1500లు రిజిస్ట్రేషన్‌ ఫీ చెల్లించవల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.50,000ల నుంచి రూ.1,20,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌లు:

  • న్యూఢిల్లీలో నవంబర్‌ 14, 2022వ తేదీన ఈ కింది అడ్రస్‌లో ఇంటర్వ్యూ ఉంటుంది. 2nd Floor, CRA Building, Safdarjung Airport Complex, Aurobindo Marg, Jor Bagh, New Delhi-110003. Contact :011-24600779/775/776
  • కలకత్తాలో నవంబర్‌ 21, 2022వ తేదీన ఈ కింది అడ్రస్‌లో ఇంటర్వ్యూ ఉంటుంది. Air India Engineering Services Ltd., APU Centre, Personnel Department, 1st Floor, New Technical Area, DUM DUM, Kolkata, West Bengal – 700052 Contact: 033-25695185
  • ముంబాయిలో నవంబర్‌ 28, 2022వ తేదీన ఈ కింది అడ్రస్‌లో ఇంటర్వ్యూ ఉంటుంది. AIESL, Personnel Department New Engineering Complex, Sahar, Vile Parle (East), Near Bamanwada, Cigarette Factory, Mumbai-400099 Contact No.: 022-26828358

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.