AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATM: అకౌంట్‌లో డబ్బులేకపోయినా ఏటీఎం నుంచి కోరినంత డబ్బు డ్రా.. బారులు తీరిన స్థానికులు!

ఏటీఎమ్‌కు వెళ్లి డబ్బు డ్రా చేసిన వారికి వింత అనుభవం ఎదురైంది. డబ్బు డ్రా చేయడానికి వెళ్లిన వారు తమ అకౌంట్‌లో డబ్బులేకపోయినప్పటికీ ఏటీఎమ్‌ మిషన్‌ నుంచి అధిక మొత్తంలో డబ్బు పొందారు. ఎక్కడంటే..

ATM: అకౌంట్‌లో డబ్బులేకపోయినా ఏటీఎం నుంచి కోరినంత డబ్బు డ్రా.. బారులు తీరిన స్థానికులు!
ATM dispenses extra cash in Goa
Srilakshmi C
|

Updated on: Nov 01, 2022 | 7:39 PM

Share

ఏటీఎమ్‌కు వెళ్లి డబ్బు డ్రా చేసిన వారికి వింత అనుభవం ఎదురైంది. డబ్బు డ్రా చేయడానికి వెళ్లిన వారు తమ అకౌంట్‌లో డబ్బులేకపోయినప్పటికీ ఏటీఎమ్‌ మిషన్‌ నుంచి అధిక మొత్తంలో డబ్బు పొందారు. సోమవారం (అక్టోబర్‌ 31) రాత్రి పలువురు వ్యక్తులకు రెండింతలు, మూడింతలుగా డబ్బు నోట్లు అందాయి. ఈ వింత సంఘటన దక్షిణ గోవాలోని బైనాలో ఓ ఏటీఎమ్‌ సెంటర్‌లో చోటుచేసుకుంది. తమ ఖాతాలో డబ్బులేనప్పటికీ ఏటీఎం నుంచి దారాపాతంగా డబ్బు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఈ వార్త చుట్టుపక్కల వ్యాపించడంతో పలువురు ఏటీఎం వద్దకు చేరుకుని డబ్బులు డ్రా చేసుకునేందుకు బారులు తీరారు. ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగు చూసింది.

వెంటనే పోలీసులు అప్రమత్తమై సదరు ఏటీఎం వద్దకు చేరుకుని బ్యాంకు అధికారులను పిలిపించి, ఏటీఎమ్‌ను మూసివేయించారు. ఐతే ఏటీఎం మిషన్‌లో లోపం ఏ కారణం చేత తలెత్తిందనే విషయం ఇంకా తెలియరాలేదు.  అప్పటికే డబ్బు డ్రా చేసిన స్థానికులు తమ వద్ద నుంచి పోలీసులు ఎక్కడ డబ్బు తిరిగి తీసుకుంటారోనని భయభ్రాంతులకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందించిన వ్యక్తి మీడియాకు తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
మరోసారి విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఇదిగో పూర్తి షెడ్యూల్
మరోసారి విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఇదిగో పూర్తి షెడ్యూల్
చరిత్రను తిరగరాసిన శ్రీలంక బ్యాటర్
చరిత్రను తిరగరాసిన శ్రీలంక బ్యాటర్
ఈ నటి కూతురు క్రేజీ హీరోయిన్.. నెట్టింట గత్తరలేపుతున్న బ్యూటీ..
ఈ నటి కూతురు క్రేజీ హీరోయిన్.. నెట్టింట గత్తరలేపుతున్న బ్యూటీ..
పెళ్లయ్యాక ఆర్థిక సమస్యలు.. ఆ హీరో వెంటనే చెక్ రాసి చేతికిచ్చారు
పెళ్లయ్యాక ఆర్థిక సమస్యలు.. ఆ హీరో వెంటనే చెక్ రాసి చేతికిచ్చారు
రాఖీ పౌర్ణమి 2026: అసలు రాఖీ కట్టేందుకు శుభ సమయం ఇదేనట..
రాఖీ పౌర్ణమి 2026: అసలు రాఖీ కట్టేందుకు శుభ సమయం ఇదేనట..
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చిల్లీ సోయా డ్రై..! రుచి అదిరిపోద్ది
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చిల్లీ సోయా డ్రై..! రుచి అదిరిపోద్ది
హిమాలయాల్లో ఏం జరిగింది..? నేపాల్‌లో వరదలకు కారణమేంటి..
హిమాలయాల్లో ఏం జరిగింది..? నేపాల్‌లో వరదలకు కారణమేంటి..
అధికారిక కార్యక్రమం ఫ్లెక్సీలో కనిపించని మంత్రి కొండా సురేఖ ఫోటో!
అధికారిక కార్యక్రమం ఫ్లెక్సీలో కనిపించని మంత్రి కొండా సురేఖ ఫోటో!
కొలంబో టెస్ట్ పై నోరు విప్పిన టీమిండియా కెప్టెన్
కొలంబో టెస్ట్ పై నోరు విప్పిన టీమిండియా కెప్టెన్
నేరుగా పదో తరగతి మార్కులతో 25 వేల తపాలా ఉద్యోగాలు.. లింక్ ఇదే
నేరుగా పదో తరగతి మార్కులతో 25 వేల తపాలా ఉద్యోగాలు.. లింక్ ఇదే