PGIMER Recruitment 2022: పదో తరగతి/ఇంటర్/డిగ్రీ అర్హతతో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నరకుపైగా జీతం..
చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్.. 256 మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, నర్సింగ్ ఆఫీసర్, స్టోర్ కీపర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..
చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్.. 256 మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, నర్సింగ్ ఆఫీసర్, స్టోర్ కీపర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టరయ్యి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 45 యేళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నవంబర్ 28, 2022వ తేదీవ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.1500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.500లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.19,900ల నుంచి రూ.1,77,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
- మెడికల్ ఆఫీసర్ పోస్టులు: 1
- అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు: 1
- నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు: 195
- స్టోర్ కీపర్ పోస్టులు: 1
- జూనియర్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు: 10
- జూనియర్ టెక్నీషియన్ (ఎక్స్-రే) పోస్టులు: 2
- జూనియర్ స్పీచ్ థెరపిస్ట్ పోస్టులు: 1
- మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ పోస్టులు: 2
- జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (ఎల్‌డీసీ) పోస్టులు: 37
- సీఎస్‌ఆర్ అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టులు: 2
- ల్యాబొరేటరీ అటెండెంట్ గ్రేడ్-2 పోస్టులు: 2
- మానిఫోల్డ్ టెక్నీషియన్ గ్రేడ్-4 పోస్టులు: 2
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.