ITBP Recruitment 2022: పదో తరగతి అర్హతతో 287 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ప్రకటన

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌.. 287 కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ గ్రూప్ ‘సి’ నాన్ గెజిటెడ్ పోస్టులకు అర్హులైన మహిళా/పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

ITBP Recruitment 2022: పదో తరగతి అర్హతతో 287 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ప్రకటన
ITBP Constable Recruitment 2022
Follow us

|

Updated on: Nov 23, 2022 | 2:24 PM

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌.. 287 కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ గ్రూప్ ‘సి’ నాన్ గెజిటెడ్ పోస్టులకు అర్హులైన మహిళా/పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల పదో తరగతి, ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నవంబర్‌ 30, 2022వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఆ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 22, 2022వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 23 నుంచి ప్రారంభమవుతుంది.

దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌-సర్వీస్‌మెన్‌, మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫకేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • కానిస్టేబుల్ (టైలర్, గార్డెనర్, కోబ్లర్‌) పోస్టులు: 65
  • కానిస్టేబుల్(సఫాయి కరంచారీ, వాషర్‌మన్, బార్బర్) పోస్టులు: 222

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Latest Articles