IHMCTAN Recruitment 2022: నెలకు రూ.లక్షకుపైగా జీతంతో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..

Srilakshmi C

Srilakshmi C |

Updated on: Nov 01, 2022 | 3:10 PM

భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన ముంబాయిలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్.. 21 అసిస్టెంట్‌ లెక్చరర్‌, లోయర్ డివిజన్‌ క్లర్క్‌, టీచింగ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

IHMCTAN Recruitment 2022: నెలకు రూ.లక్షకుపైగా జీతంతో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..
IHMCTAN Recruitment 2022

భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన ముంబాయిలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్.. 21 అసిస్టెంట్‌ లెక్చరర్‌, లోయర్ డివిజన్‌ క్లర్క్‌, టీచింగ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌/బ్యాచిలర్స్‌ డిగ్రీ/డిప్లొమా/పీజీ/ఎంబీఏ లేదా తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నవంబర్‌ 28, 2022వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 28, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో అభ్యర్ధులు తప్పనిసరిగా రూ.500లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.35,400ల నుంచి రూ.1,12,400ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్: Principal, Institute of Hotel Management, Catering Technology and Applied Nutrition, Veer Savarkar Marg, Dadar, Mumbai-400028.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu